Friday, 21 August 2020

ఆమెను పెళ్లి చేసుకోలేదు, సహజీవనం చేస్తున్నా.. షాకిచ్చిన రాహుల్ రామకృష్ణ

జర్నలిస్ట్‌గా కెరియర్ ప్రారంభించిన కమెడియన్ .. షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి అర్జున్ రెడ్డి చిత్రంతో పాపులర్ కమెడియన్‌గా పేరు సంపాదించారు. భరత్ అనే నేను, గీత గోవిందం, అలవైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి.. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్, విరాట పర్వం చిత్రాల్లో కీలకమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఆయన తన పర్శనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం తాను ఒక అమ్మాయితో సహజీవనం చేస్తున్నట్టు తెలిపారు కమెడియన్ రాహుల్ రామకృష్ణ. 2018 అక్టోబర్ 23న తాను జనవరి 15న పెళ్లి చేసుకోబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా అఫీషియల్‌గా ప్రకటించారు రాహుల్ రామకృష్ణ. బిందు అనే అభిమానిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్టు పెళ్లి వార్తను చెప్పిన రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం తన ప్రేయసితో సహజీవనంలో ఉన్నట్టు ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పెళ్లిని లైట్ తీసుకుకోలేదు.. బట్ నేను చేసే సినిమాలు పెళ్లి చేసుకునే అవకాశం ఇవ్వట్లేదని చమత్కరించారు రాహుల్ రామక్రిష్ణ. 2019 జనవరిలో పెళ్లి చేసుకుంటామని తెలిపిన రాహుల్.. ఆ తరువాత జూన్‌కి వాయిదా వేశారు. అయితే తాను ఎప్పుడు చేసుకున్నా సింపుల్‌గా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటానని.. నాకు లైఫ్ మీద పెద్ద సీరియస్ లేదని నాకు కాబోయే భార్యకు కూడా తెలుసు. ఇంచుమించి ఆమె కూడా నాలాగే అంటూ తన ప్రేయసితో లవ్ స్టోరీ ఎలా మొదలైందో చెప్పుకొచ్చారు రాహుల్ రామక్రిష్ణ. ‘మా వైఫ్‌ని నేను సోషల్ మీడియాలో కలిశా. నా అర్జున్ రెడ్డి సినిమా చూసి నాకు మెసేజ్ చేసింది. ఆ తరువాత నేను ఫ్లాట్ కోసం వెతుకుతుంటే.. మా ఇంటి పక్కన ఫ్లాట్స్ ఉన్నాయి వచ్చి చూడమని చెప్పింది. ఆమెని సర్ ప్రైజ్ చేద్దాం అని ఇంటి అడ్రస్ కనుక్కుని ఆమె ఇంటికి వెళ్లి తలుపు కొట్టా. కాని అప్పటికే ఆమె ఆఫీస్‌కి వెళ్లిపోయింది. ఆ తరువాత ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకుని ప్రేమమలో పడ్డాం. ఆ తరువాత మా ఇంట్లో చెప్పాం.. వాళ్లు ఓకే చెప్పారు కాని.. మేం ఇంకా పెళ్లి చేసుకోలేదు. రిజిష్టర్ మ్యారేజ్ కాలేదు.. ప్రస్తుతం సహజీవనం చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను లైన్‌లో పెట్టేవారు.. ఇప్పుడు నా భార్య లైన్‌లో పెడుతోంది. ఎప్పుడైనా లైన్ క్రాస్ చేస్తే లైన్‌లో పెడుతుంది’ అంటూ తన లివింగ్ రిలేషన్ షిప్‌ని రివీల్ చేశారు కమెడియన్ రాహుల్ రామక్రిష్ణ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Qb0Rye

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....