Friday, 21 August 2020

Anchor Devi కన్ఫార్మ్: బిగ్ బాస్ 4లో టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై క్లారిటీ ఇస్తూ.. రీసెంట్‌గా టీవీ 9 నాగవల్లి బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్స్‌గా రాబోతుందని ముందే తెలిపింది ‘సమయం తెలుగు’. అయితే త్వరలో ప్రారంభం కాబోతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్‌ 4లో నాగవల్లి ఫైనల్ అయ్యింది. రీసెంట్‌‌గా బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్‌కి సంబంధించి 15 మంది లిస్ట్‌ని సమయం తెలుగు రివీల్ చేయగా.. ఇందులో యాంకర్ దేవితో పాటు దేత్తడి హారిక, నోయల్, రఘుమాస్టర్, ప్రణవి, మహాతల్లి ఇలా కొన్ని పేర్లను ఎక్స్ పెక్టెడ్ లిస్ట్‌లో ప్రస్తావించాం. అయితే వీరిలో యాంకర్ దేవి ఫైనల్ కంటెస్టెంట్‌గా కన్ఫార్మ్ అయ్యింది. గత రెండు సీజన్లు (సీజన్ 2, సీజన్ 3)లలో టీవీ 9 ఛానల్ తరుపున ఇద్దరు యాంకర్లు రంగంలోకి దిగారు. సీజన్ 2లో దీప్తి నల్లమోతు బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా రాగా.. సీజన్ 3లో జర్నలిస్ట్ జాఫర్ బిగ్ బాస్ కంటెంస్టెంట్‌గా హౌస్‌కి వెళ్లిన విషయం తెలిసింది. తాజాగా నాలుగో సీజన్‌కి ఈ ఛానల్ నుంచి దేవి నాగవల్లి బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ చేసేందుకు రెడీ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ అంచనా.. 1. సయ్యద్ సోహెల్ (క్రిష్ణవేణి సీరియల్ యాక్టర్, యురేక మూవీ హీరో) 2&3. మహాతల్లి జాహ్నవి, ఆమె భర్త సుశాంత్ 4&5. రఘు మాస్టర్ & ప్రణవి 6. జెమిని యాంకర్ ప్రశాంతి 7. సింగర్ నోయెల్ 8. నందు (గీతా మాధురి భర్త) 9. జబర్దస్త్ ముక్కు అవినాష్ 10. కరాటే కళ్యాణి (నటి) 11. జోర్దార్ సుజాత (యాంకర్) 12. మెహబూబా దిల్ సే (టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్) 3. యాంకర్ అరియానా గ్లోరీ (జెమిని కెవ్వు కామెడీ యాంకర్) 14. దేత్తడి హారిక 15. టీవీ9 యాంకర్ దేవి.. ఈ 15 మంది దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా.. 16. ప్రియ వడ్లమాని 17. అపూర్వ 18. యామినీ భాస్కర్ 19. పూనమ్ భజ్వా 20. అకిల్ సార్థక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ 20 మందిలో ఇద్దర్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మూడు లేదా నాలుగో వారంలో హౌస్‌లోకి పంపే అవకాశం కనిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2CPECLq

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....