Saturday, 2 May 2020

మై డియర్ బచ్చా.. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే, నీ బట్టర్ ఉడకదురా: చిరంజీవి ట్వీట్ వైరల్

మెగాస్టార్ ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆయన ట్వీట్స్‌లో సైతం మెగా మార్క్ చూపిస్తున్నారు. ప్రారంభంలో మోహన్ బాబు‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్స్‌ సోషల్ మీడియాలో ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఛలోక్తులు, చమత్కారాలకు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా తన పుత్రరత్నం మెగా పవర్ పవర్ స్టార్ రామ్ చరణ్‌‌ను మై డియర్!! బచ్ఛా అంటూ మరో ఫన్నీ ట్వీట్ వదిలారు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న .. కిచెన్‌లో వెన్న చిలికే విధానాన్ని తన నాన్నమ్మ అంజనా దేవి దగ్గర తెలుసుకుంటూ.. ఆ వీడియోను శుక్రవారం నాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కోడలు సురేఖ, మనవడు రామ్ చరణ్‌కు వెన్న చిలికే విధానాన్ని నేర్పిస్తూ కనిపించింది తల్లి అంజనా దేవి. వెన్న తీస్తూ.. రామ్ చరణ్‌ని కృష్ణుడిలా ఉన్నావని కామెంట్ చేయడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగాస్టార్ స్పందిస్తూ.. అదిరిపోయే ఫన్నీ ట్వీట్ పెట్టారు. ‘‘మై డియర్ బచ్చా ... మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే.. నువ్వు ఎంత మంచిగా బ‌ట్ట‌ర్ చేసిన‌ప్ప‌టికీ, నా స్థానం క‌న్నా నీ స్థానం బెట‌ర్ కాదు. అది గ్యారెంటీ. ఇది మీ అమ్మ ద‌గ్గ‌ర నాకు లేద‌నుకో’’ చమత్కరించారు మెగాస్టార్. మొత్తానికి మెగాస్టార్ చరణ్‌ని ఉద్దేశించి చేసిన ఈ బట్టర్ బెటర్ ట్వీట్‌లో పంచ్‌లు పేలిపోవడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ రీ ట్వీట్లు చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bYrTlI

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....