Saturday, 2 May 2020

మానవజాతి ‘మడి’ కట్టుకుంది.. నన్ను శిక్షిస్తారా? సంచలనంగా మారిన జొన్నవిత్తుల కామెంట్స్

కరోనా నేపథ్యంలో సినీగేయ రచయిత రామలింగేశ్వరరావు రాసిన పాటపై దుమారం రేగుతోంది. నిస్సిగ్గుగా తన జాతే గొప్పదని, తన కులమే భారతీయ సంస్కృతి అని.. సోషల్ డిస్టెన్స్ పేరుతో మరోమారు వర్ణ వ్యవస్థను తీసుకువస్తూ విషం వెళ్ళగక్కారంటూ సోషల్ మీడియాలో జొన్నవిత్తులపై మండిపడుతున్నారు దళిత, వెనుకబడిన వర్గాల వారు. అయితే తాను ఒక జాతిని కాని, ఒక వర్గం వారిని ఉద్దేశించి పద్యం రాయలేదని.. బ్రాహ్మణులు తమ కుటుంబాల్లో పాటించే మడి విధానం గురించే ప్రస్తావించానంటూ క్లారిటీ ఇచ్చారు జొన్నవిత్తుల. మొత్తానికి వివాదాల సుడిగుండంగా జొన్నవిత్తుల కరోనా పాట మారడంతో మరోమారు షాకింగ్ కామెంట్స్ చేశారాయన. ఇది లౌకికపరమైన విషయం అని ఇప్పటికీ తాను రాసిన పాటకు కట్టుబడి ఉన్నానన్నారు. వితంతువివాహం, బాల్య వివాహం లాంటివి దురాచారాలు.. వాటిని మనం ఇప్పుడు నెత్తిన పెట్టుకున్నారని తాను అనలేదని.. ఏవైతే బ్రాహ్మాణ ఆచారాలు ఉన్నాయో.. మడి లాంటి వాటిని పాటించడం లేదని.. ఇప్పుడు కరోనా వల్ల యావత్ మానవజాతి బ్రాహ్మణులు పాటించే మడి విధానాన్ని పాటిస్తున్నారన్నారు జొన్నవిత్తుల. మళ్లీ మళ్లీ చెప్పున్నా.. మానవ జాతి మడికట్టుకుని ఉంది అని చెప్తున్నా.. ఇలా అన్నందుకు నాకు శిక్ష వేస్తారేమో వేయమనండి. ఈరోజు కరోనా వల్ల ఎవరూ ఎవర్ని తాకడం లేదు. ఇదే కదా మడి అంటే. మరణసయ్యపై మడికట్టుకుని ఉంది మానవజాతి. ఆ మడి కట్టుకోవడం అంటే నువ్ నా దగ్గరకు రాకు.. నేను నీ దగ్గరకు రాని అని. శాస్త్రవేత్తలు కూడా దీన్ని పాటించమని చెప్తున్నారు.. మీరూ కూడా పాటించడి అని నా పాట రూపంలో చెప్పా.. అంతరానితనం, అస్పృశ్యత, కుల వివక్షతలకు తాను వంత పాడలేదన్నారు జొన్నవిత్తుల.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SrWDnr

No comments:

Post a Comment

''Have Muslims Faced Problems In Maharashtra?'

'We have given riot-free Maharashtra in our 18-month rule.' from rediff Top Interviews https://ift.tt/pLavVg8