Saturday, 23 May 2020

అత్తామామలకు షాకిచ్చిన రానా.. పెళ్లికి ముందే అలా! ఓపెన్ అయిన దగ్గుబాటి వారసుడు

టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆమె ఎస్ అనేసింది అంటూ ఇటీవలే సడెన్ సర్‌ప్రైజ్ ఇస్తూ తన ప్రేయసి మిహికా బజాజ్‌ని పరిచయం చేశారు రానా. తామిద్దరం ప్రేమలో ఉన్నామని చెబుతూ ఆమె పిక్ షేర్ చేశారు. దీంతో ఈ ఇష్యూ టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ఇంతలో రోకా ఫంక్షన్ చేసుకొని ఇరు కుటుంబ పెద్దల ఆమోదాన్ని పొంది మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ వేడుకకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో అసలు మిహీకతో రానా స్నేహం ఎలా కుదిరింది? అది ప్రేమ దాకా దారితీసిన పరిస్థితులేంటి? వారిద్దరూ ఎప్పుడు లవ్‌లో పడ్డాడు? అనే విషయాలపై జనాల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఆసక్తిని తెరదించేలా `లాక్డ్ అప్ విత్ లక్ష్మి` (ఇన్ స్టా) షోలో మంచు లక్ష్మి మంచు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ తన లవ్ స్టోరీ సంగతులన్నీ చెప్పారు దగ్గుబాటి రానా. తన చెల్లెలు ఆశ్రిత క్లాస్ మేట్ అని, అలా తనకు చాలా కాలంగా తెలుసని, ఒకరినొకరు అర్థం చేసుకుని లవ్‌లో పడ్డామని చెప్పారు. అయితే అందరిలా కాకుండా తన లవ్ ప్రపోజల్ విషయంలో విలక్షణత చాటుకున్నారట రానా. Also Read: తాను ప్రేమిస్తున్నాననే విషయాన్ని ఫోన్ ద్వారా మిహీకాకు చెప్పారట రానా. ఆ తర్వాత ఇద్దరూ కలుసుకొని నిర్ణయం తీసుకున్నాక నేరుగా ప్రేయసి మిహిక తల్లిదండ్రుల ఇంటికెళ్లి.. తమ ప్రేమ విషయాన్ని నేరుగా చెప్పేసి షాకిచ్చారట. అలా అలా తన ప్రేమ సంగతులన్నీ ఓపెన్‌గా చెప్పేశారు రానా. త్వరలోనే నిశ్చితార్థం చేసుకుంటామని అన్నారు. మరోవైపు ఈ ఏడాదే రానా పెళ్లి ఉంటుందని కన్ఫర్మ్ చేశారు సురేష్ బాబు. సో.. దగ్గుబాటి వారి పెళ్లి బాజాల్లో ఎంత హంగామా చూడనున్నామో మీరే ఊహించుకోండి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZvTLuo

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....