టాలీవుడ్‌కు సంక్రాంతి సీజన్ భారీ ఆదాయాన్ని ఇస్తుంది. కరోనా, లాక్డౌన్ వంటివి లేకపోతే కచ్చితంగా బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో సంక్రాంతి సమీకరణాలు మొత్తం మారిపోయాయి. సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. అయితే తాజాగా ఈ రేసులోకి మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ‘విజేత’ అంటూ మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపును అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘సూపర్ మచ్చి’ అనే సినిమాలో నటించాడు. పులి వాసు తెరకెక్కించిన ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రుచితా రామ్ హీరోయిన్‌గా నటించింది. మెగా కాంపౌండ్‌కు చెందిన కళ్యాణ్ దేవ్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలన్న పట్టుదలతో ‘సూపర్ మచ్చి’ కోసం ఎంతో శ్రమించినట్లు తెలుస్తోంది. లుక్స్, ఫిజిక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడట. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మొత్తానికి పెద్ద పెద్ద సినిమాలే సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటూ ఉండగా.. ఇలా మెగా అల్లుడు ధైర్యం చేసి సూపర్ మచ్చిని విడుదల చేసేందుకు ముందుకు వచ్చాడు. సూపర్ మచ్చి సినిమాలో రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రగతి, అజయ్, పోసాని కృష్ణమురళి, మహేష్, షరీఫ్, సత్యలు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతమందించిన సంగతి తెలిసిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31gDLPY
No comments:
Post a Comment