సీరియల్ పాత్రలు సూపర్ హీరోల కారెక్టర్ల కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ ఓ ఊపు ఊపేస్తోంది. ఇప్పటికీ టాప్ రేటింగ్‌తో కార్తీక దీపం దుమ్ములేపేస్తోంది. అయితే ఈ సీరియల్ పాత్రలేమో గానీ వారి నిజ జీవితాలు మాత్రం ఎప్పుడూ నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ఇక మోనిత పాత్రలో అదరగొట్టేస్తుంది. కార్తీక్, డాక్టర్ బాబు కారెక్టర్‌లో నిరుపమ్, అతని తమ్ముడు ఆదిత్య పాత్రలో అందరికీ సుపరిచితులే. అయితే తెరపై కార్తీక్ చుట్టూ మోనిత తిరిగితే.. నిజ జీవితంలో మాత్రం ఆదిత్య (యశ్వంత్) చుట్టూ మోనిత (శోభా శెట్టి) తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే శోభా శెట్టి యూట్యూబ్ వీడియోలు, ఇన్ స్టా పోస్టుల్లో ఎక్కువగా ఆదిత్య కనిపిస్తుంటాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతోన్నారు. న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఇందులో ఆదిత్యపైకి ఉప్పు బస్తాల మోనిత ఎక్కేసింది. మొత్తానికి ఈ పోస్టర్ చూస్తుంటే ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. అంటూ రాబోతోన్న ఈ ప్రాజెక్ట్ మీద నెటిజన్లు సెటైర్లు వేస్తోంది. కార్తీక్‌ను వదిలేశావా? మరిదితో ఇలా చేస్తున్నావా? అంటూ మోనిత పాత్రను శోభా శెట్టికి నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. వదిన అవుతుంది కదా? ఆదిత్య అంటూ ఇంకొందరు నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. మొత్తానికి బుజ్జి బంగారం అనే ఈ మూవీ ఫస్ట్ లుక్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3JzCtkv
No comments:
Post a Comment