భార్య కాళ్లు పట్టుకోవడంపై బాలకృష్ణ వివరణ ఇవ్వడమేంటి? అనగానే చాలా మందికి సందేహం రావచ్చు. అసలు ఆయన తన తన శ్రీమతి కాళ్లు పట్టుకున్నారా? ఇంతకీ ఏ సందర్భంలో అనే కుతూహలం కూడా కలగవచ్చు. ఇంతకీ ఈ విషయం చెప్పింది ఎవరో కాదు. స్వయంగా ఆయనే. ప్రస్తుతం బాలకృష్ణ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ టాక్ షోలో సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ స్పీడు చూపిస్తున్నారు. బాలయ్య ఇంటర్వ్యూలను హ్యాండిల్ చేస్తున్న తీరు చూసిన వారందరూ ఓ రకంగా ఆశ్చర్యపోతున్నారు. అన్‌స్టాపబుల్‌గా బుల్లెట్ బండిలా దూసుకెళ్తున్న బాలయ్య.. రీసెంట్‌గా దగ్గుబాటి హీరో రానాను తన టాక్‌షోలో ఇంటర్వ్యూ చేశారు. అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ - రానా దగ్గుబాటి మధ్య సాగిన సంభాషణకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో చూస్తుంటే రానాను బాలకృష్ణ బాగానే ఆటపట్టించినట్లు కనిపిస్తుంది. ఈ ఇంటర్వ్యూ సాగే క్రమంలో రానా కూడా బాలయ్యను కొన్ని ప్రశ్నలు వేసినట్లు తెలుస్తుంది. మీ శ్రీమతితో గొడవ పడినప్పుడు మీలో ముందు సారీ చెబుతారు? అని రానా అడిగినప్పుడు బాలకృష్ణ తనే అన్నట్లు ఓ షో కార్డ్ చూపించారు. ఈ క్రమంలో మీరెప్పుడైన భార్య కాళ్లు పట్టుకున్నారా? అని అడగ్గా.. నీకెందుకయ్యా? అని సరదాగా రివర్స్ అయిన బాలకృష్ణ.. తదుపరి బాలకృష్ణ మాట్లాడుతూ కృష్ణుడు అంతటివాడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు.. బాలకృష్ణుడెంత అనడంతో షోలో నవ్వులు నిండిపోయాయి. భార్య కాళ్లు పట్టుకోవడం గురించి బాలకృష్ణ ఇచ్చిన తెలివైన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది. అన్‌స్టాపబుల్‌లో రానాను చేసిన ఇంటర్వ్యూ పూర్తిగా చూడాలంటే జనవరి 7వరకు ఆగాల్సిందే. ఆరోజున ఆహాలో బాలయ్య, రానా మధ్య సరదాగా సాగిన ఇంటర్వ్యూను పూర్తిగా చూడొచ్చు. ఇంకా రానాను బాలకృష్ణ చాలా ప్రశ్నలే వేశారు. దానికి రానా కూడా చాలా సరదాగా సమాధానాలు చెప్పారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EILPGR
No comments:
Post a Comment