ఆస్కార్ అవార్డ్ విజేత సాధించిన భారతీయ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎ.ఆర్.రెహమాన్ తనకంటూ ఓ ఆధ్యాయాన్ని రాసుకున్నారు. ఈయన పెద్ద కుమార్తె ఖతీజా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది. డిసెంబర్ 29న ఖతీజా పుట్టినరోజు. ఆరోజున పరిమిత సంఖ్యలో హాజరైన బందు మిత్రుల సమక్షంలో రియాస్దీన్ రియాన్‌తో ఖతీజాకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. ‘దేవుని ఆశీస్సులతో రియాస్దీన్ రియాన్‌తో నాకు నిశ్చితార్థం జరిగింది. అదే సమయంలో నా దగ్గరి బంధువుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు కూడా జరిగాయి. చాలా సంతోషంగా ఉంది’ అని రెహమాన్ కుమార్తె ఖతీజా తన ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు. రియాస్దీన్ రియాన్ కూడా ఇదే విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. అసలు ఎ.ఆర్.రెహమాన్‌కు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఆయనకు అల్లుడు అవుతున్నారంటే, ఆయనేం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అందరిలోనూ ఉంటుంది. మరి ఇంతకీ రియాస్దీన్ రియాన్ ఏం చేస్తారో తెలుసా!.. ఆయనొక ఆడియో ఇంజనీర్, ఎంట్రప్రెన్యూరర్. ఇక ఖతీజా విషయానికి వస్తే ఆమెకు కూడా తండ్రి బాటలోనే సాగుతున్నారు. రీసెంట్‌గా విడుదలైన ‘మీమి’ చిత్రంలోని రాక్ ఏ బై బేబీ అనే పాటను ఖతీజానే పాడారు. అలాగే ఖతీజా సంగీత ప్రపంచంలో తనదైన గుర్తింపును సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఆమె ఫరిస్టోన్ అనే మ్యూజిక్ ఆల్బమ్‌ను కూడా విడుదల చేశారు. ఈ మ్యూజిక్ వీడియోకు ఉత్తమ యానిమేషన్ మ్యూజిక్ వీడియోగా అవార్డు కూడా రావడం విశేషం. అలాగే ఎ.ఆర్.రెహమాన్ మరో కుమార్తె రహీమా నటిగా సినీ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతోంది. ఆమె యాక్టింగ్‌లో శిక్షణ కూడా తీసుకుంటోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3JycUjL
No comments:
Post a Comment