టాలీవుడ్‌లో సీనియర్ నటుడు పెద్ద కుమారుడు రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. శనివారం ఆయన కన్నుమూశారు. రమేష్ బాబు మరణంపై కృష్ణ, మహేష్ బాబుకి సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రమేష్ బాబు అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు. ముందుగా ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితుల సందర్శనార్ధం పద్మాలయా స్టూడియోలో ఉంచారు. తన పెద్ద కొడుకు రమేష్ బాబు మరణం కృష్ణకి తీరని శోకాన్ని మిగిల్చింది. రమేష్ బాబుని కడసారి చూపులు చూసుకోవడానికి నటుడు కృష్ణ పద్మాలయా స్టూడియోకు వచ్చారు. కొడుకుని అలా చూసి ఆయన ఎమోషనల్ అయ్యారు. అక్కడే చాలా సేపు కూర్చుండిపోయారు. రమేష్ బాబు కొడుకు, కుమార్తెను పలకరించి వారికి ధైర్యం చెప్పారు. ఇక మహేష్ బాబుకి కరోనా పాజిటివ్ కావడంతో ఆయన ఐసోలేషన్‌లోనే ఉన్నారు. నమ్రత ఇతర కుటుంబ సభ్యులు రమేష్ బాబు పార్థివ దేహాన్ని చూడటానికి పద్మాలయా స్టూడియో వచ్చారు. రమేష్ బాబు సినీ ప్రస్థానానికి వస్తే.. ఆయన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో యువ అల్లూరి పాత్రలో కనిపించి సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత మరి కొన్ని చిత్రాల్లోనూ నటించారు. ‘సామ్రాట్’ చిత్రంతో హీరోగా మారారు. కెరీర్ ప్రారంభంలో బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు వంటి చిత్రాలు రమేష్ బాబుకు మంచి పేరుని తెచ్చి పెట్టాయి. తర్వాత ఆయన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో సినిమా రంగానికి హీరోగా దూరమయ్యారు. కృష్ణ నటించిన ఎన్‌కౌంటర్ సినిమాలో కీలక పాత్రను పోషించారు. ఆ తర్వాత ఆయన నటనకు పూర్తిగా దూరమయ్యారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు. తండ్రి పేరు మీదనే కృష్ణ ప్రొడక్షన్స్‌ను స్టార్ట్ చేశారు. దూకుడు, ఆగడు చిత్రాలకు రమేష్ బాబు సమర్పకుడిగా ఉన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FdvxpM
No comments:
Post a Comment