సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు ఆకస్మిక మరణం సినీ లోకంలో విషాదం నింపింది. ఆయన మృతిపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2గంటల తర్వాత మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. 1965 అక్టోబర్ 13వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ, ఇందిర దంపతులకు జన్మించారు రమేష్ బాబు. ఆయననకు భార్య మృదుల, చెల్లెల్లు మంజుల, పద్మావతి, ప్రియదర్శిని, సోదరుడు మహేష్ బాబు ఉన్నారు. సూపర్ స్టార్ నట వారసుడిగా చిన్నతనంలోనే నటుడిగా పరిచయమైన రమేష్ బాబు దాదాపు 15 చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి సుమారు ఐదు చిత్రాలను నిర్మించారు. అర్జున్, అతిథి, దూకడు, ఆగడు సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. కృష్ణ తనయుడుగా అల్లూరి సీతారామరాజు చిత్రంలో యువ అల్లూరి పాత్రలో కనిపించి సినీరంగ ప్రవేశం చేసిన రమేష్ బాబు.. బాల నటుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత తన 23వ ఏట హీరోగా పరిచయమయ్యారు. 1987లో 'సామ్రాట్' సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా రమేష్ బాబును పరిచయం చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకున్నారట కృష్ణ. డైలాగ్స్, డాన్స్, ఫైట్స్ విషయంలో నిపుణులతో ట్రైనింగ్ ఇప్పించి మరీ రంగంలోకి దించారట. ఆ సమయంలో ఎన్టీఆర్, కృష్ణ మధ్య మాటలు లేవట. దీంతో బాలకృష్ణకు పోటీగా తన కొడుకును కృష్ణ రంగంలోకి దించినట్లు ప్రచారం కూడా జరిగింది. నటుడిగా, నిర్మతగా రమేష్ బాబుకు తెలుగు సినీ పరిశ్రమతో సుమారు 40 దశాబ్దాల అనుబంధం ఉన్నప్పటికీ ఆయన మార్క్ పెద్దగా కనిపించలేదు. కృష్ణ వారసుడిగా ఎదిగేందుకు చాలా స్కోప్ ఉన్నా కూడా ఆయన ఎదగలేకపోయారు. అయితే ఇందుకు ప్రధాన కారణం ఆయన సున్నితత్వమే అనేది సినీ వర్గాల మాట. సినిమా అనే మాస్ మీడియంలో సౌమ్యుడైన ఆయన ఇమడలేకపోయారని, అందుకే ఆయనకు నటనపై ఆసక్తి సన్నగిల్లి క్రమంగా కెమెరాకు దూరమయ్యారనేది సన్నిహితుల మాట. నిర్మాతగా కూడా ప్రయత్నించి ఆ తర్వాత వెనక్కి తగ్గిన రమేష్ బాబుకు ఈ సినీ రంగంలో వినిపించే గాసిప్స్, గుసగుసలు పెద్దగా నచ్చేవి కావట. అందుకే క్రమంగా ఆయన సినిమాలకు దూరమయ్యారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nbTLKT
No comments:
Post a Comment