సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు ఘట్టమనేని శనివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో టాలీవుడ్ లోకంలో విషాదం అలుముకుంది. పలువురు సినీ ప్రముఖులు మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్నయ్య రమేష్‌తో మహేష్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. రమేష్ అంటే మహేష్‌కు ఎంతో ప్రేమతో పాటు అభిమానం కూడా. ఆయనతో కలిసి జబార్ రౌడీ, ముగ్గురు కొడుకులు వంటి సినిమాల్లో నటించిన మహేష్.. రమేష్ బాబుకు అపజయాలు ఎదురైనప్పుడు అండగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. రమేష్ బాబు, మధ్య మంచి ఎమోషనల్ బాండింగ్ ఉండేదట. బయటికి అంతగా కనిపించక పోయినప్పటికీ.. చిన్నతనం నించే ఈ ఇద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారట. ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించుకునే విధంగా చర్చలు జరుపుకునేవారట. అయితే హీరోగా రమేష్ బాబుకు సక్సెస్ రాకపోవడంతో నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ సమయంలో అన్నయ్యకు ఎంతో అండగా నిలిచారట మహేష్. 1999లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా హిందీలో సూర్యవంశం సినిమా నిర్మించిన రమేష్ బాబు.. ఆ తర్వాత 2004లో తమ్ముడు మహేష్ హీరోగా రూపొందిన అర్జున్ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా ఆశించిన మేర లాభాలు తెచ్చిపెట్టకపోవడంతో మరోసారి 2007 సంవత్సరంలో అదే మహేష్ బాబుతో 'అతిథి' సినిమా చేశారు. అది కూడా నష్టాలనే మిగల్చడంతో ఆ విషయంలో మహేష్ బాబు కూడా చాలా బాధపడ్డాడట. ఎలాగైనా అన్నయ్యకు తానే మంచి సక్సెస్ అందించాలని ఫిక్స్ అయిన మహేష్.. దర్శకులు చెప్పే డిఫరెంట్ కథలు వింటూ చివరకు 2011లో దూకుడు సినిమాతో రమేష్ బాబుకు భారీ విజయాన్ని అందించారు. అనంతరం 2014లో 'ఆగడు' సినిమా చేసి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు రమేష్ బాబు. ఆయన నిర్మాణంలో సినిమాలు చేసి రమేష్ బాబును బడా నిర్మాతగా చూడాలని మహేష్ బాబు చాలాసార్లు చర్చలు జరిపినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని టాక్. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రమేష్ బాబు అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు. ముందుగా ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితుల సందర్శనార్ధం పద్మాలయా స్టూడియోలో కొంతసేపు ఉంచుతారు. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండటం కారణంగా అభిమానులు ఎక్కువగా గుమిగూడకుండా ఉండాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని ఘట్టమనేని ఫ్యామిలీ రిక్వెస్ట్ చేసింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3r440Cf
No comments:
Post a Comment