'ఛలో' అంటూ టాలీవుడ్ గడపతొక్కి సినిమా సినిమాకు తన క్రేజ్ అమాంతం పెంచుకుంటోంది హీరోయిన్ . తనకు మాత్రమే సొంతం అన్నట్లుగా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యువత మనసు దోచుకుంటోంది. దీంతో భాషాబేధం లేకుండా రష్మికకు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. తెలుగుతో పాటు హిందీ సహా ఇతర భాషల్లోనూ ఈ బ్యూటీ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ డిమాండ్ క్యాచ్ చేస్తూ తన పారితోషికం పెంచేసిందట రష్మిక. రీసెంట్‌గా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' సినిమాతో ఆమె లైఫ్ టర్న్ అయినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమాతో ఆమెను స్టార్ స్టేటస్ వరించిందని, అంతేకాదు ప్యాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో ఈ మూవీ రిలీజ్ కావడం రష్మికకు బాగా ప్లస్ అయిందని చెప్పుకుంటున్నారు. నేషనల్ క్రష్‌గా కుర్రకారు గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఆమెకు పుష్ప మూవీలో చేసిన పల్లెటూరు పిల్ల క్యారెక్టర్ కెరీర్ టర్నింగ్ పాయింట్ అయిందనే టాక్ నడుస్తోంది. దీంతో ఈ సిచుయేషన్ క్యాచ్ చేసుకోవాలని ఫిక్స్ అయిందట రష్మిక మందన. మరోసారి తన రెమ్మ్యూనరేషన్ పెంచేసిందట. ఇంతవరకు ఒక్కో సినిమాకు 1.75 కోట్ల నుంచి 2 కోట్ల వరకు రెమ్మ్యూనరేషన్ తీసుకున్న ఆమె, ఇకపై చేయబోయే సినిమాలకు 3 కోట్ల వరకు డిమాండ్ చేయాలని భావిస్తోందట. ఎలాగూ పుష్పతో బీటౌన్‌లో కూడా భారీ క్రేజ్ దక్కింది కాబట్టి ఈ డిసీజన్ తీసుకుందట రష్మిక. ఒకవేళ ఇదే జరిగితే ఈ అమ్మడు సమంతను బీట్ చేసినట్లవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2 కోట్ల వరకు తీసుకుంటోందట. ఇకపోతే ప్రస్తుతం రష్మిక.. హిందీలో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' సినిమాలు చేస్తోంది. అలాగే తెలుగులో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీని చకచకా కంప్లీట్ చేస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు. మరోవైపు 'పుష్ప' సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న 'పుష్ప: ది రూల్' సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో భాగమయ్యేందుకు సిద్ధమవుతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qZUuQx
No comments:
Post a Comment