Wednesday, 18 August 2021

గవర్నర్ తమిళిసై ఇంట్లో విషాదం.. చిరంజీవి ఎమోషనల్

తెలంగాణ గవర్నర్ తల్లి కృష్ణకుమారి కన్నుమూశారు. నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణకుమారిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె నిన్న (ఆగస్ట్ 18) ఉదయం తుదిశ్వాస విడిచారు. నిన్న సాయంత్రం గవర్నర్ సొంత ఊరు సాలిగ్రామానికి కృష్ణకుమారి పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. నేడు చెన్నైలో కృష్ణకుమారి అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే తల్లి మరణంతో శోకసంద్రంలో మునిగిన తమిళిసైని సినీరాజకీయ ప్రముఖులు పరామర్శించారు. గవర్నర్ తల్లి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గవర్నర్ తమిళిసైలో ధైర్యాన్ని నింపారు. గౌరవనీయులైన తమిళై గారి తల్లి చనిపోవడం ఎంతో బాధాకరమైన విషయం.. గవర్నర్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢసానుభూతిని తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ చిరు ఎమోషనల్ అయ్యారు. ఇక తమిళిసై చిరంజీవి, ఆయన నటించిన సైరా సినిమా విడుదల సమయంలో చేసిన కామెంట్ల గురించి అందరికీ తెలిసిందే. సైరాను వీక్షించిన తమిళిపై చిరుపై ప్రశంసల వర్షం కురిపించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2W3zPPG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....