Saturday, 28 August 2021

Revanth Reddy: టాలీవుడ్ డ్రగ్ కేసు‌కి KTR గోవా వెళ్లడానికి లింక్ ఏంటి? వాళ్లతో సన్నిహితంగా.. రేవంత్ సంచలన ఆరోపణలు

మంత్రి కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు . టాలీవుడ్ డ్రగ్స్ కేసుకి సంబంధించి తాజాగా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) పలువురు సెలబ్రిటీలకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసు‌లో ఇండస్ట్రీ పెద్ద తలకాయలతో పాటు.. రాజకీయ ప్రముఖులు కూడా భాగస్వామ్యులుగా ఉండడంతో ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదనే ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా.. రకుల్ ప్రీత్ సింగ్, పూరీ జగన్నాథ్, రానా, ముమైత్ ఖాన్‌లతో పాటు మరో 12 మందికి ఈడీ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుండగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఈ డ్రగ్స్ కేసులోకి కేటీఆర్‌ని లాగారు. మరుగున పట్ట ఈ కేసుని మళ్లీ వెలుగులోకి రావడానికి కారణం తానే అంటూ బాంబ్ పేల్చారు రేవంత్. ఆయన మాట్లాడుతూ.. ‘గత నాలుగైదు కేటీఆర్ గారు చాలా ఆందోళనలో ఉన్నారు.. బయటకు కూడా రాలేదు. ఎందుకంటే ఈ మధ్యనే ఆయన గోవాకి పోయి వచ్చాడు. ఆయన గోవాకి ఎందుకు పోయాడు.. ఎందుకు ఆందోళనగా ఉన్నాడు.? ఆయన సహచరులకు.. అత్యంత సన్నిహితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ తీగ లాగితే ఏం డొంక కదులు తుందో త్వరలోనే తెలుస్తుంది. ఈ సందర్భంగా అందరికీ తెలియాల్సింది ఏంటంటే.. నేను హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజనా వాజ్యం వేసినందుకే ఈ నోటీసులు వచ్చాయి. మీడియా మిత్రులు ఎంత దాచిపెట్టినా నిజం బయటకు రాకుండా రాదు. ఆనాడు అకున్ సబర్వాల్‌ని అధికారిగా నియమించి.. విచారణ జరిపించి కొంతమంది పిలిచి కొంతమందిని వదిలేశారు. ఎందుకంటే.. ఈ విచారణలో ప్రముఖుల పేర్లు.. కేటీఆర్ సన్నిహితుల పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో కేసుని తొక్కిపెట్టారు.. అకున్ సబర్వాల్‌ని బదిలీ చేశారు. దీంతో నేను హైకోర్టులో వాజ్యం వేస్తే.. ఈడీ అఫడవిట్ దాఖలు చేసింది. విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని స్పష్ఠంగా చెప్పింది. సీబీఐ కూడా ఇదే విషయం చెప్పింది. సేకరించిన ఆధారాలను మాతో పంచుకోవడం లేదని చెప్పింది ఈడీ. నిజంగా ఈ డ్రగ్స్ కేసులో ప్రభుత్వ పెద్దలు వారి సన్నిహితుల పాత్ర లేకపోతే.. అమ్మకాలలో కానీ కొనుగోలులో కానీ వీరి పాత్ర లేకపోతే.. కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థల్ని ఎందుకు తిరస్కరించింది. ఈ మధ్య కాలంలో కేటీఆర్ గోవాకి ఎందుకు వెళ్లారు.? అంత రహస్యంగా గోవాకి వెళ్లడానికి కారణం ఏంటి? అది అధికారిక ప్రయాణమా? లేక ప్రైవేటు ప్రయాణమా..? అసలు ఏం జరిగిందో జర్నలిస్ట్‌లు ఆధారాలను బయటకు తీయండి. పిల్లల భవిష్యత్‌ని ఏ రకంగా నాశనం చేస్తున్నారో నిజాలను బయటకు తీయండి. ఈ డ్రగ్స్‌కి సంబంధించి ప్రభుత్వ వైఖరి ప్రజలకు తెలియజేయాలి’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ykvcy1

No comments:

Post a Comment

'Trump Will Back India On Pakistan'

'Trump will absolutely back New Delhi on its position that Pakistan must do more to crack down on terrorists that threaten India.' ...