Saturday, 28 August 2021

The Ghost: నాగార్జున బర్త్ డే సర్‌ప్రైజ్.. ఘోస్ట్‌గా మారిన మన్మథుడు.. కింగ్ మేకోవర్ అదుర్స్!!

నేడు (ఆగస్టు 29) టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతూ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్ . తమ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాకు '' అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్‌లుక్ పోస్టర్ వదిలారు. దీంతో ఈ పోస్టర్ నెట్టింట క్షణాల్లో వైరల్ అయింది. ఈ పోస్టర్‌లో నెత్తుటి చుక్కలతో కూడిన కత్తి పట్టుకొని నాగ్ స్టయిలిష్‌గా నిలబడగా, విదేశీ జనాలు అంతా అతని ముందు మోకరిల్లి కనిపించారు. చూస్తుంటే ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కుతోందని స్పష్టమవుతోంది. టైటిల్‌కు తగ్గట్లే ఈ పోస్టర్ డిజైన్ చేశారు. పోస్టర్ చూసి కింగ్ మేకోవర్ అదుర్స్ అంటున్నారు నెటిజన్లు. PSV గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్‌‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్లపై నారాయణ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ మూవీలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫస్ట్‌ షెడ్యూల్‌ గోవాలో పూర్తిచేసిన చిత్రయూనిట్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kBAfFp

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...