Sunday, 29 August 2021

HBD Nagarjuna : నీతోనే నాకు మొదటిసారి.. రాము బావ అంటూ వయ్యారాలు ఒలకబోసిన అనసూయ

ఏది చేసినా ప్రత్యేకమే. తెరపై కనిపించినా, సోషల్ మీడియాలో అల్లరి చేసినా, వెకేషన్స్‌లో ఎంజాయ్ చేసినా కూడా అనసూయ అందరి కంటే స్పెషల్‌గానే ఉంటారు. అలాంటి అనసూయకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. అయితే అదే సమయంలో అనసూయపై నెగెటివిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆ నెగెటివిటీ, ట్రోలింగ్‌ను అనసూయ ధైర్యంగా ఎదుర్కొంటారు. అంతే స్థాయిలో తిప్పి కొడతారు. అనసూయ వెండితెరపై చేసిన మ్యాజిక్కు అంతా ఇంతా కాదు. ఆమె చేసిన ప్రతీ పాత్ర కూడా ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేసేసింది. అలా అనసూయ మొదటి సారి స్టార్ హీరో అయిన నాగార్జునతో జత కట్టేశారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేసింది. పక్కన ఆడి పాడిన అనసూయను చూసి అందరూ ఫిదా అయ్యారు. అందులో అనసూయ కనిపించిన తీరుకు ఆడియెన్స్‌ అబ్బురపడిపోయారు. అలా అనసూయ తాజాగా తనకు తొలి అవకాశాన్ని ఇచ్చిన నాగార్జునకు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలిపారు. నేడు (ఆగస్ట్ 29) నాగార్జున బర్త్ డే. ఈ క్రమంలో సోగ్గాడే చిన్ని నాయన సినిమాలోని స్టిల్స్‌ను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే రాము బావ.. స్క్రీన్ మీద తొలిసారిగా నీతోనే నటించాను.. అదొ గొప్ప ప్రారంభం. ఎప్పుడూ ఇంతే అందంగా ఉండేందుకు మీరే స్ఫూర్తి.. బంగార్రాజు సినిమాకు ఆల్ ది బెస్ట్.. అంటూ అనసూయ విషెస్ తెలిపారు. మొత్తానికి అనసూయ విషెస్ చెప్పిన విధానానికి అందరూ ఫిదా అవుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sXgEn5

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....