Tuesday, 31 August 2021

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ హవా.. బన్నీ రేర్ ఫీట్.. సౌత్ ఇండస్ట్రీలోనే తొలి హీరోగా రికార్డు

రాను రాను సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోంది. నిత్యం సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో టచ్‌లో ఉండే సెలబ్రిటీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చిరంజీవి, మోహన్ బాబు లాంటి సీనియర్ హీరోలు సైతం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ ఖాతాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన సమాచారాన్ని అందరి ముందుకు తెస్తున్నారు. ఇక నేటితరం హీరోహీరోయిన్ల హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ తాజాగా అరుదైన ఫీట్ సాధించారు. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఫాలోయింగ్ పెంచుకొని సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఐకాన్ స్టార్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 13 మిలియన్ ఫాలోవర్స్ చేరిపోయారు. అంటే కోటి 30 లక్షల మంది అల్లు అర్జున్ అకౌంట్ ఫాలో అవుతున్నారన్నమాట. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో ఈయనే కావడం విశేషం. 2017, నవంబర్‌లో అధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చిన బన్నీ, క్రమం తప్పకుండా అభిమానులతో టచ్ లోకి వస్తూ అంచెలంచెలుగా ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ వచ్చారు. అల్లు అర్జున్ 13 మిలియన్ మైలురాయిని అధిగమించడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతూ ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా తనదైన నటన, టాలెంట్‌తో సత్తా చాటుతున్న అల్లు అర్జున్.. తన కెరీర్‌లో తొలిసారి పాన్ ఇండియా మూవీ 'పుష్ప' చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ జోడిగా రష్మిక మందన నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. దీంతో పటు 'ఐకాన్' అంటూ మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేస్తున్నారు అల్లు అర్జున్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zzdqbP

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....