ప్రస్తుతం తెలంగాణ సమాజంలో మార్మోగిపోతోన్న పాట ఏంటో అందరికీ తెలిసిందే. అనే ఈ పాటలోని పదాలు, అందులోని అర్థాలు, జానపదాల్లోని సొబగులు అందరికీ తెగ నచ్చేశాయి. మరీ ముఖ్యంగా పాటను హృదయానికి హత్తుకునేలా లక్ష్మణ్ రాయడం ఒకెత్తు అయితే.. ఎస్కే బాజీ బాణీ తెలంగాణ పల్లె సమాజానికి దగ్గరం ఉండటం మరో ఎత్తు. ఇక వీటన్నంటికి కంటే ఎక్కువగా, ముందుగా చెప్పుకోవాల్సింది ఆ గాత్రం గురించే. టాలీవుడ్‌లో ఎంతో మంది సింగర్లున్నారు. కానీ ఏ ఒక్కరిలోనూ తెలంగాణ యాసను పలకడం గానీ, ఆ యాసలో పాటను పాడటం కానీ అంతగా రాదు. కానీ మాత్రం ఆ సాహసం చేశారు. తెలంగాణ పల్లెకు చెందిన పిల్లలా మారిపోయారు. ఆ పాటలోని పదాలు, వాటిని పలకాల్సిన తీరును అవపోసన పట్టేశారు. తెలంగాణ అమ్మాయే ఆ పాట పాడినట్టుగా అనిపిస్తుంది. ఇక ఆ గాత్రం అందరినీ కట్టిపడేస్తే.. వీడియో పాటతో ఎంతో మందిని ఫిదా చేసేశారు మోహన భోగరాజు. ఆ కట్టు, బొట్టు, బాణీకి, పాటకు తగ్గట్టుగా వేసిన స్టెప్పులు మోహన భోగరాజు జనాలకు మరింత దగ్గర చేసేసింది. అలా బుల్లెట్టు బండి పాటకు సోషల్ మీడియా పట్టం కట్టేసింది. ఆ మధ్య పెళ్లి కూతురు బరాత్‌లో వేసిన డ్యాన్సుతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అప్పటి నుంచి ఎక్కడ చూసినా బుల్లెట్టు బండి పాటే అందరి నోళ్లలో నానింది. బుల్లెట్టు బండి పాట మీద కొన్ని లక్షల్లో రీల్ వీడియోలున్నాయి. ఇక పెళ్లి కూతురు డ్యాన్స్ వీడియో అయితే ఎక్కడా చూసినా సరే మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టేసింది. ఎంతో మంది చిన్నారులు సైతం బుల్లెట్టు బండికి కాలు కదుపుతున్నారు. అలా ఈ పాట ఇప్పుడు తెలంగాణ మొత్తానికి వ్యాప్తిచెందింది. ఎక్కడైనా సరే పెళ్లి జరుగుతుందంటే చాలు అక్కడ బుల్లెట్టు బండి మార్మోగిపోవాల్సిందే. మొన్నామధ్య ఎంపీ మాలోతు కవిత కూడా పెళ్లిలో బుల్లెట్టు బండికి కాలు కదిపారు. అలా తెలంగాణ పెళ్లిల్లో బుల్లెట్టు బండి తప్పక ప్లే చేయాల్సిందే అన్నట్టుగా మారింది. ఇదే విషయాన్ని కార్టూన్ రూపంలో చెప్పారు. బుల్లెట్టు బండి పాటకు వచ్చిన క్రేజ్‌ను చిన్న మాటలో, కార్టూన్‌లో చెప్పేశారు. ఆ కార్టూన్‌పై మోహన భోగరాజు స్పందించారు. ఇద్దరు అమ్మలక్కలు కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు.. పక్కనే వారి అమ్మాయి డ్యాన్సు వేస్తోన్నట్టుగా కార్టూన్ ఉంది. మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం పిన్నీ.. ఈలోగా ఎందుకైనా మంచిదని పాటకు డ్యాన్స్ నేర్పిస్తున్నాం అని చెబుతుంటుంది. ఆ పక్కనే వారి అమ్మాయి డుగ్గు డుగ్గు డుగ్గు అంటూ స్టెప్పులు వేస్తున్నట్టుగా ఆ కార్టూన్ ఉంది. అంటే తెలంగాణలో పెళ్లి అంటే కచ్చితంగా బుల్లెట్ బండి పాట ఉండాల్సిందే.. ఆ పాటకు స్టెప్పులు వేయాల్సిందే అన్నట్టుగా జనాల్లో స్థిరపడిపోయింది. అలా వేసిన ఈ కార్టూన్ మీద సింగర్ మోహన భోగరాజు స్పందించారు. లవ్ సింబల్‌ను షేర్ చేస్తూ తన సంతోషాన్ని వెల్లిబుచ్చారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sUbsQK
No comments:
Post a Comment