Tuesday, 31 August 2021

ఆ పండుగకు వస్తున్న మాస్ మహరాజ.. ఇక ఆ విషయంలో ఎలాంటి డౌట్లు లేవు

ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు రవితేజ. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో, శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మాస్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లలో దూసుకుపోయింది. ఈ సినిమా చేస్తూనే రవితేజా మరో రెండు సినిమాలు సైన్ చేశాడు. అందులో ‘ఖిలాడి’ ఒకటి. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలా కాలమే అయింది. అయినప్పటికీ సినిమా గురించి సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలాకాలమే అయింది. అయినా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌‌డేట్ రాలేదు. ఇక రవితేజ అభిమానులు ఈ సినిమా నుంచి ఎప్పుడు.. అప్‌డేట్ వస్తుందా.. తమ అభిమాన హీరోను స్క్రీన్‌పై మళ్లీ ఎప్పుడు చూస్తామా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రవితేజా నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఓ ఆసక్తికర వ్యార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదల కానుంది అంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. జయంతిలాల్‌ గడ సమర్పణలో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. , మీనాక్షి చైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై త్వరలోనే ప్రకటన వెలుడనుంది. మరి ఈ సినిమాతో రవితేజ ఫ్యాన్స్‌ని ఏ రేంజ్‌లో అలరిస్తారో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WCEE2G

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...