Saturday, 28 August 2021

గోవాలో ఎక్కువగా గడిపింది మేమిద్దరమే!.. అసలు గుట్టు విప్పిన నమ్రత శిరోద్కర్

సూపర్ స్టార్ ఫ్యామిలీ మొన్నటి వరకు గోవాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. సినిమా గోవా షెడ్యూల్ మొత్తానికి సక్సెస్ ఫుల్‌గా గడిచింది. టీం మొత్తం వెనక్కి తిరిగి వచ్చేసింది. అక్కడ మహేష్ బాబుతో మంచి యాక్షన్ సీక్వెన్లను రామ్ లక్ష్మణ్ మాస్టర్లు తెరకెక్కించినట్టు తెలుస్తోంది. మామూలుగా అయితే మహేష్ బాబు తన ఫ్యామిలీని తీసుకుని అలా వెకేషన్స్‌కు వెళ్తే బాగానే ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ సారి మాత్రం అలా జరగలేదని తెలుస్తోంది. ఈ విషయం గురించి నమ్రత తాజాగా ఓ పోస్ట్ చేశారు. ఫ్యామిలీ మెన్ అనిపించుకునే మహేష్ బాబు ఈ సారి గోవాలో మాత్రం ఎక్కువగా షూటింగ్‌తోనే బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీతో ఎక్కువగా వెకేషన్‌లకు వెళ్లనట్టు కనిపిస్తోంది. సితార, నమ్రత, గౌతమ్, వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఇలా అందరూ కలిసి బాగానే ఎంజాయ్ చేశారు. కానీ ఎక్కడా కూడా మహేష్ బాబు కనిపించలేదు. దానికి సంబంధించి తాజాగా నమ్రత అసలు విషయం చెప్పేశారు. గోవాలో ఎక్కువ సమయం గడిపింది మేమిద్దరమే అని నమత్ర తన కూతురు సితారతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. అంటే మమేష్ బాబు తన సినిమా షూటింగ్‌తోనే బిజీగా ఉన్నట్టున్నారు. గోవాలో ఎక్కువగా కలిసి ఉంది తామిద్దరమే అని చెబుతూ షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. గోవాలో ఎలా ఎంజాయ్ చేశారో చూపిస్తూ ఆద్య సితార యూట్యూబ్ చానెల్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gFUuAZ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....