Monday 30 August 2021

NBK 47 Years: అఖండ విజయాలందుకున్న లెజెండ్ ఈ నటసింహం.. బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన నందమూరి హీరో!!

నటవారసత్వం అనేది సినీ ఎంట్రీ సమయంలో ఇచ్చే బూస్టింగ్ మాత్రమేనని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఏదో ఒకటి రెండు సినిమాల వరకు స్టార్ కిడ్స్ అనే ముద్రతో ఆదరణ లభిస్తుంది కానీ ఆ తర్వాత సదరు స్టార్ కిడ్ టాలెంట్‌పైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇలా ఈ కేటగిరీలోనే సినీ ఎంట్రీ ఇచ్చి రికార్డులు చెరిపేస్తూ సంచలనాలకు మారుపేరయ్యారు నందమూరి . ఆయన సినిమాల్లోకి వచ్చి 47 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన '' విజయాలను నెమరు వేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నందమూరి ఫ్యాన్స్. 'తాతమ్మకల'. 1974 సంవత్సరంలో ఈ సినిమాను నందమూరి తారక రామారావు డైరెక్ట్ చేయడమే కాకుండా స్వయంగా నిర్మించారు కూడా. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు భానుమతి, హరికృష్ణ, బాలకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించింది. 'తాతమ్మ కల' సినిమా తర్వాత అదే ఏడాది 'రామ్ రహీమ్' అనే మరో సినిమాతో సక్సెస్ అందుకొని 1975లో అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి అనే సినిమాలు చేశారు బాలయ్య. చైల్డ్ ఆర్టిస్టుగా ఎక్కువగా తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్న బాలయ్య బాబు.. 1984లో 'సాహసమే జీవితం' అనే సినిమాతో సోలో హీరోగా కెమెరా ముందుకొచ్చారు. అప్పటినుంచి వెనుతిరిగి చూడకుండా బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు బాలకృష్ణ. ''ముద్దుల కృష్ణయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, సమరసింహా రెడ్డి, ముద్దుల మామయ్య, భైరవ ద్వీపం, నరసింహ నాయుడు సింహ, లెజెండ్, గౌతమి పుత్ర శాతకర్ణి'' ఇలా వైవిద్యభరితమైన కథలతో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించిన బాలకృష్ణ స్టార్ హీరోగా నేటికీ అదే హవా నడిపిస్తున్నారు. సినిమాల పరంగా సెంచరీ కొట్టేసి ప్రస్తుతం 'అఖండ' మూవీ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zx3zU0

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz