Saturday, 28 August 2021

‘అవి వినడం సంతోషంగా ఉంది’.. సుధీర్‌బాబు సినిమాపై.. ప్రభాస్ దర్శకుడి ప్రశంసల వర్షం

డైనమిక్ హీరో హీరోగా.. ‘పలాస 1978’ ఫేమ్ క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్‌తో రన్‌ అవుతోంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు పాజిటివ్ రివ్యూనే ఇస్తున్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు సెంటిమెంట్‌ కూడా అదిరిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. హీరోయిన్‌గా ఆనంది నటించగా.. సీనియర్ హీరో నరేష్ ప్రధాన పాత్ర పోషించారు. ఓ విషాదమైన ప్రేమగాథ అయినప్పటికీ.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ కూడా మామూలుగా చేయలేదు. సినిమా టైలర్‌ని సూపర్‌స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా.. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు సినిమా యూనిట్. సుధీర్‌ బాబుకి ఉన్న ఇమేజ్‌తో పాటు ఇవన్నీ కూడా సినిమాకు ఎంతో ప్లస్‌ అయ్యాయి. అయితే రీసెంట్ ఈ సినిమాని మహేష్‌బాబు తన ఇంట్లోని మినీ థియేటర్‌లో వీక్షించారు. ఇది చూసిన మహేష్ ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉంది అని.. ప్రతి ఒక్కరు తమ పాత్రకు న్యాయం చేశారు అని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఈ సినిమాకు మరో ప్రముఖ వ్యక్తి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన మరెవరో కాదు.. ‘కేజీఎఫ్’ సినిమాతో యావత్ దేశాన్ని కుదిపేసిన దర్శకుడు . ఈ సినిమాను చూసిన ప్రశాంత్ మొదట తన మిత్రుడు.. ఈ సినిమా నిర్మాత విజయ్ చిల్లాకు అభినందనలు తెలిపారు. ఈ సినిమా గురించి మంచి విషయాలు వినడం ఆనందంగా ఉంది అని ఆయన అన్నారు. అంతేకాక.. దర్శకుడు కరుణ కుమార్‌ని కూడా ఆయన అభినందించారు. మొత్తం టీమ్ అంతా కలిసి సినిమాని హిట్ చేశారు అని పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DsROAb

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...