Sunday, 29 August 2021

Prabhas: కృష్ణాష్టమి స్పెషల్ ట్రీట్.. 'రాధే శ్యామ్' నుంచి సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ''. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో వరల్డ్ వైడ్ ప్రభాస్ అభిమానుల్లో ఆతృత నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా స్పెషల్ ట్రీట్ ఇస్తూ 'రాధే శ్యామ్' నుంచి మరో సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్నఈ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్యగా, డాక్టర్‌ ప్రేరణగా నటిస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరి స్టిల్ రిలీజ్ చేస్తూ సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌ని తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ప్రభాస్.. తన అభిమానులకు, ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో హీరోహీరోయిన్లు ప్రభాస్, పూజా హెగ్డేల లుక్ ఎంతో అట్రాక్ట్ చేస్తుండటంతో నెట్టింట వైరల్ అవుతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల సంయుక్త సమర్పణలో ఈ మూవీ రూపొందుతోంది. చిత్రంలో భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛేత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణంరాజు రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందట. తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gJiR0o

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....