Thursday, 26 August 2021

Republic: కూలిపొతాం, కుంగిపొతాం, ఓడిపోతాం.. అయినా! యంగ్ హీరోయిన్ లుక్‌తో రమ్యకృష్ణ స్ట్రాంగ్ మెసేజ్

''ప్రతి రోజూ పండుగే, సోలో బ్రతుకే సో బెటర్'' వంటి సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. మరికొద్ది రోజుల్లో '' అనే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌‌గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. సీఎం పాత్రలో సీనియర్ హీరోయిన్ కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూ డిఫరెంట్ స్టైల్ ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. సినిమా కథ, అందులోని కంటెంట్ ఎంత గ్రిప్పింగ్‌గా ఉంటుందనేది తెలిసేలా 'రిపబ్లిక్' నుంచి ఒక్కొక్కటిగా వదులుతున్న అప్‌డేట్స్ హైప్ పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ లుక్‌ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు రమ్యకృష్ణ. ‘‘కూలిపోతాం.. కుంగిపోతాం, ఓడిపోతాం! అయినా.. నిల‌బ‌డ‌తాం, కోలుకుంటాం, గెలుస్తాం!’’ అని పోస్ట‌ర్‌పై ఉన్న లైన్స్ సినిమాలో ఐశ్వర్య రోల్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందనేది తెలుపుతున్నాయి. రాజకీయ నేపథ్యమున్న సినిమా కాబట్టి అందుకు తగ్గట్టుగానే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల చేయనున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలకపాత్ర పోషించారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో 14వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ypc1Dg

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....