Friday, 27 August 2021

‘మహేష్ సినిమా చూస్తున్నారు.. ఏమంటారో మరి’..: ఆసక్తికర ట్వీట్ చేసిన సుధీర్ బాబు

డైనమిక్ హీరో హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్'. ‘పలాస 1978’ ఫేమ్ క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టైలర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. మంచి యాక్షన్, డైలాగ్స్‌తో సాగే ఈ ట్రైలర్ చూసి.. సినిమాపై ఎన్నో అంచనాలను పెంచుకున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ని సుధీర్ బాబు బావ, సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో విడుదల చేయించారు చిత్ర యూనిట్. ఇక ఆ తర్వాత ప్రమోషన్స్‌లో కూడా మంచి జోష్ చూపించారు. ‘బాహుబలి’, యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ని ఈ సినిమా ప్రమోషన్స్‌లోకి దించారు. చిత్ర యూనిట్‌తో ఆయనతో ఓ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇప్పించారు. దీంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇక శుక్రవారం (ఆగస్టు 27న) సినిమా విడుదల అయింది. అయితే ఈ సినిమా ఓ విషాదమైన ప్రేమగాథ అయినప్పటికీ.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మొదటి షో పడినప్పటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా నుంచి ఓ వ్యక్తి నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు సుధీర్ బాబు. ఆయన మరెవరో కాదు.. సూపర్‌స్టార్ మహేష్‌ బాబు. మహేష్ తాజాగా.. తన ఇంట్లోని మినీ థియేటర్‌లో ఈ సినిమాను వీక్షించారు. ఇందుకు సంబంధిచిన ఫోటోను సుధీర్‌బాబు స్వయంగా తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మహేష్ సినిమా చేస్తున్నారు.. ఏం అంటారో మరి’ అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే.. త్వరలోనే ఈ సినిమాపై మహేష్ నుంచి రివ్యూ వచ్చే అవకాశం ఉంది. మహేష్ నుంచి పాజిటివ్ రివ్యూ వస్తే.. సినిమాకు మరింత హైప్ పెరిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yo1doX

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...