Sunday, 29 August 2021

పదిహేడేళ్ళ ప్రాయంలో శ్రుతీ హాసన్ అలా.. సర్జరీలకు ముందు గుర్తు పట్టలేనంతగా!

సినిమా ఇండస్ట్రీలో సర్జరీలు అనే పదం నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. అందంగా మారేందుకు హీరో హీరోయిన్లు సర్జరీల మీదే ఆధారపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ సర్జరీలు వికటిస్తుంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో సర్జరీల ద్వారా ఎంతో అందంగా మారిన తారలున్నారు. అయితే స్వర్గీయ శ్రీదేవీ మాత్రం సర్జరీలకు మారుపేరుగా నిలిచింది. శ్రీదేవీ ఎన్నో సార్లు సర్జరీలు చేసుకుందని అంటుంటారు. ఇక నేటి తరం హీరోయిన్లలోనూ చాలా మంది సర్జరీలు చేసుకున్న వారున్నారు. అందులో సమంత, వంటి వారు పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇక హీరోయిన్లే కాకుండా హీరోలు సైతం సర్జరీలు చేసుకున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు సర్జరీలు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీటిపై ఎవ్వరూ కూడా అంతగా నోరు మెదపరు. కానీ శ్రుతీ హాసన్ మాత్రం ఆ మధ్య తన సర్జరీల గురించి మాట్లాడారు. తన ముక్కుకు సమస్య ఉండటంతో సర్జరీ చేసుకున్నాను.. అయితే మీకేంటి? అని ట్రోలర్లను శ్రుతీ హాసన్ కడిగిపారేశారు. తన శరీరంలో తనకు తన ముక్కు అంటేనే ఇష్టమని కూడా శ్రుతీ హాసన్ చెప్పుకొచ్చారు. అయితే శ్రుతీ హాసన్ ఎన్నో సర్జరీలు చేసుకున్నారు. సర్జరీల అనంతరమే ఇప్పుడున్న రూపం వచ్చింది. అయితే తాను ఎప్పుడూ కూడా తన పాత రూపాన్ని కించపరుచుకోలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా తన పాత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె పదిహేడేళ్ల ప్రాయంలో చేసిన ఫోటో షూట్ గురించి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను ఎలా ఉన్నానో చూపించే ప్రయత్నం చేశారు. కానీ అందులో శ్రుతీ హాసన్‌ను గుర్తు పట్టడం చాలా కష్టమైన పని. సర్జరీ కంటే ముందు ఇలా ఉండేదా? అని అనిపించేంత ఘోరంగా శ్రుతీ హాసన్ ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38rD6eo

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...