Friday, 27 August 2021

అక్కినేని నాగార్జున పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్.. ప్రీ లుక్‌తో అట్రాక్ట్ చేసిన ప్రవీణ్ సత్తారు

టాలీవుడ్ కింగ్ జోష్ పెంచేశారు. ఇటీవలే 'బంగార్రాజు' మూవీ సెట్స్ పైకి వచ్చిన ఆయన, మరోవైపు PSV గరుడవేగ ఫేం దర్శకత్వంలో మరో సినిమాతో బిజీ అవుతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రానుందని చాలారోజుల క్రితమే ప్రకటన రాగా, కొంత కాలం షూటింగ్ జరుపి ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేశారు. అయితే పరిస్థితులు చక్కబడటంతో ఈ సినిమాను మళ్ళీ సెట్స్ మీదకు తెచ్చిన చిత్రయూనిట్.. తాజాగా ప్రీ లుక్‌తో సర్‌ప్రైజ్ చేస్తూనే అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఆగస్టు 29వ తేదీన ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్‌డేట్ రాబోతుందనే విషయాన్ని తెలుపుతూ ప్రీ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. నాగార్జున ఫేస్‌ను రివీల్ చేయకుండా పూర్తి బ్లాక్ కలర్ డ్రెస్‌తో నెత్తుటి ధారలతో తడిసిన ఖడ్గం పట్టుకుని వర్షంలో నడుస్తున్నట్టు ఈ పోస్టర్‌లో చూపించారు. నాగ్ పుట్టినరోజు ఆగస్టు 29వ తేదీ కావడంతో ఆ రోజు స్పెషల్ అప్‌డేట్ ఉంటుందని చెప్పారు. దీంతో ఆ అప్‌డేట్ పట్ల అక్కినేని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్లపై నారాయణ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ మూవీలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫస్ట్‌ షెడ్యూల్‌ గోవాలో పూర్తిచేసిన చిత్రయూనిట్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zta1eQ

No comments:

Post a Comment

'Please Save My Mum'

'Doctors feel they have a duty to prolong a heartbeat at all costs.' from rediff Top Interviews https://ift.tt/2TnvHrW