Sunday, 29 August 2021

Chiranjeevi: దిగ్గజ క్రికెటర్‌తో చిరు దంపతుల మీట్.. ఇది చాలా స్పెషల్ అంటూ మెగాస్టార్ మెసేజ్

టాలీవుడ్ సీనియర్ హీరో, మెగాస్టార్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ మధ్యే సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్ షేర్ చేస్తూ మెగా అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా గ్యాప్ తర్వాత తన పాత మిత్రుడిని కలిశానని తెలుపుతూ చిరంజీవి పెట్టిన పోస్ట్ ఆన్ లైన్ వేదికలపై హంగామా చేస్తోంది. భారత దేశ కీర్తి పతాకం ప్రపంచ దేశాలు చూసేలా తొలి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‌తో చిరంజీవికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అయితే రీసెంట్‌గా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన ఓ వేడుకకు చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి హాజరు కాగా.. అదే వేడుకకు వచ్చిన కపిల్ దేవ్‌ని చూస చిరు ఒక్కసారిగా సంతోషంతో ఉప్పొంగిపోయారు. చిరంజీవి, ఆయన భార్య సురేఖ కలిసి కాసేపు కపిల్ దేవ్‌తో సరదాగా ముచ్చటించారు. ఈ ఫోటోలకు ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన చిరంజీవి.. ''చాలా రోజుల తర్వాత పాత మిత్రుడు కపిల్‌దేవ్‌ను కలవడం ఆనందంగా ఉంది. ఇందుకు ఫలక్‌నుమా ప్యాలెస్‌ మరింత శోభనిచ్చింది. ఎన్నో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గతంలోకి వెళ్లి వచ్చాము. దేశానికి మొట్టమొదటి ప్రపంచకప్ అందించిన హర్యానా హరికేన్ కపిల్ దేవ్'' అని పేర్కొన్నారు. చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' మూవీ పనులు పూర్తి చేస్తూనే తన తదుపరి సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ''గాడ్ ఫాదర్, బోళా శంకర్'' సినిమాలతో ఆయన బిజీ బిజీగా ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kA2jJr

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....