Friday, 27 August 2021

Rahul Sipligunj : నాతో మూడు రోజులు.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. అషూపై రాహుల్ కామెంట్స్

ప్రైవేట్ ఆల్బమ్స్ కోసం ఎంతలా కష్టపడతాడో అందరికీ తెలిసిందే. తన దగ్గర డబ్బులున్నా లేకపోయినా, అప్పులు తెచ్చి అయినా సరే ఆల్బమ్స్ చేస్తుంటారు. తెలుగు ఆల్బమ్స్, ఇండిపెండెంట్ సింగర్లకు గుర్తింపు తీసుకురావాలని పరితపిస్తుంటారు. అలాంటి రాహుల్ చివరగా బేబీ అనే అదిరిపోయే పాటను చేశారు. కానీ దాని కోసం పెట్టిన ఖర్చు మాత్రం హద్దులు దాటింది. రాహుల్ అనుకున్నంతగా అది క్లిక్ కాలేదు. హిందీలోనూ విడుదల చేశారు కానీ వర్కవుట్ అవ్వలేదు. బేబీ కోసంపెట్టిన బడ్జెట్‌తో ఓ సినిమా కూడా తీసేయొచ్చు అని ఆ తరువాత రాహుల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాహుల్ పాటలు పాడుతూ, హీరో, నటుడుగా ఫుల్ బిజీగా ఉన్నారు. అలాంటి రాహుల్ సిప్లిగంజ్ తాజాగా నువ్వెవరో అనే ఆల్బమ్ చేశారు. ఇందులో తన జోడికి అషూ రెడ్డిని తీసుకున్నారు. ఇక రాహుల్ అషూ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మీద ఎన్ని రూమర్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. సాయంత్రం అయితే చాలు పార్టీలు చేసుకోవాల్సిందే.. తామిద్దరం క్లోజ్ అయింది కూడా అక్కడే అని అషూ చెప్పుకొచ్చారు. అలా అషూ రాహుల్ వ్యవహారం ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతుంటుంది. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని అషూ, రాహుల్ చెబుతుంటారు. తాజాగా నువ్వెవరే అనే పాట కోసం అషూ చేసిన సాయం, నిజమైన ఫ్రెండ్ షిప్ గురించి చెప్పుకొచ్చారు రాహుల్. మాది ఫ్రెండ్ షిప్ అని గుర్తించిన మొదటి వ్యక్తివి నువ్వే అంటూ ఓ నెటిజన్కు రాహుల్ రిప్లై ఇస్తూ.. అషూ ఈ ఆల్బమ్, ఈ వీడియో చేసేందుకు నాతో మూడు రోజులు ఉంది. కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఓ ఫ్రెండ్‌ను అంతలా సపోర్ట్ చేసింది.. అదే నిజమైన ఫ్రెండ్ షిప్ అని అషూ గురించి రాహుల్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు. దానిపై అషూ స్పందిస్తూ.. లవ్యూ రాహుల్ అని చెప్పేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BhKeqi

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....