బండ్ల గణేష్‌కు గత ఏడాది వచ్చిన సంగతి తెలిసిందే. అలా కరోనా నుంచి కోలుకున్న తరువాత బండ్ల గణేష్‌లో ఎంతో మార్పు వచ్చింది. గొడవలు, కొట్లాటలు, శ్రతుత్వాలు, ద్వేషాలు ఎందుకు.. ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉండిపోతే ఎమవుతుంది అంటూ ఇలా ఎన్నో మంచి మాటలు చెప్పేశారు . కరోనాతో చావును దగ్గరి నుంచి చూశానని, దాని కంటే పెద్దది ఏదీ ఉండదని అన్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం బండ్లన్న మరోసారి కరోనా బారిన పడ్డారట. వకీల్ సాబ్ ఈవెంట్‌లో దుమ్ములేపిన బండ్లన్నకు కరోనా సోకినట్టుంది. వకీల్ సాబ్ సమయంలో ఎంతో మంది కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. హీరోయిన్ నివేదా థామస్‌కు కరోనా సోకడంతో అలా అలా అందరికీ వ్యాప్తించినట్టుంది. అయితే బండ్ల గణేష్‌కు కూడా ఆ సమయంలో కరోనా వచ్చిందట. ఆ విషయంలో మీడియాలో ఎక్కువగా ఎక్కడా రాలేదు. కానీ పవన్ కళ్యాణ్‌కు కరోనా అని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. అదే సమయంలో బండ్ల గణేష్‌కు కూడా కరోనా వచ్చిందట. అది చాలా సీరియల్ అయిందట కూడా. ఒక్కరోజు ఆలస్యమైతే చచ్చిపోయేవాడివి అని డాక్టర్లు చెప్పారట. లంగ్స్ మొత్తం డ్యామేజ్ అయ్యాయని తెలిపారట. హాస్పిటల్‌లో జాయిన్ అయ్యేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించి బండ్ల గణేష్ విఫలమయ్యారట. ఈ విషయాలన్నీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. ‘నాకు రెండో సారి కరోనా వచ్చింది. ఎక్కడా రూంలు లేవు. ఎవ్వరిని అడిగినా లేవనే చెప్పారు. మా బాస్ పవన్ కళ్యాణ్‌ను అడుగుదామంటే.. ఆయనే కరోనాతో బాధపడుతున్నారు. ఆ సమయంలో చిరంజీవికి ఫోన్ చేశాను. మొదట మేనేజర్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఆ తరువాత నేరుగా గారికే ఫోన్ చేశాను. అన్నయ్య పరిస్థితి ఇది అని చెప్పాను. మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. ఆ తరువాత ఫోన్ పెట్టేశారు. సరిగ్గా రెండు నిమిషాల తరువాత అపోలో నుంచి ఫోన్ వచ్చింది. వెళ్లే సరికి నాకోసం పది మంది డాక్టర్లు ఎదురుచూస్తున్నారు. నన్ను బాగా చూసుకున్నారు. ఐసీయూలో పెట్టారు. ఒక్కరోజు ఆలస్యమైతే చచ్చిపోయే వాడినని డాక్టర్లు చెప్పారు. మూడు రోజులు అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలీదు. వందసార్లు చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఫాలో అప్ చేశారు. నా గురించి అంతగా కేర్ తీసుకున్నారు. అలా నాకు ప్రాణం పోసిన వారు చిరంజీవి. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. అలాంటి వారికి కృతజ్ఞత చూపకపోతే నన్ను మనిషి అని ఎవరైనా అంటారా? రుణపడి ఉండకపోతే నేను మనిషినే కాదు. కోలుకున్న తరువాత మళ్లీ ఫోన్ చేసి తిట్టారు. అంత సీరియస్ అయ్యే వరకు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నావ్ అని అరిచేశారు. అలా నా ప్రాణాలను కాపాడారు. జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయనకు పాదాభివందనం చేస్తున్నాను’ అని బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DpTiLG
No comments:
Post a Comment