Saturday, 28 August 2021

S Thaman : మోహన భోగరాజుపై తమన్ ప్రశంసలు.. నాటి వీడియో మళ్లీ తెరపైకి!

సోషల్ మీడియాలో ఒక్కో సెలెబ్రిటీకీ ఒక్కో సందర్భంలో టైం వస్తుంది. అప్పుడందరూ కూడా వారి గురించి మాట్లాడుకుంటారు. వారికి సంబంధించిన వీడియోలే కనిపిస్తుంటాయి. అలా ఇప్పుడు సింగర్ పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఎక్కడ చూసినా ఆమె పాటలే మార్మోగిపోతోన్నాయి. సింగర్‌గా టాలీవుడ్‌లో ఎప్పటి నుంచి రాణిస్తోన్నా కూడా బాహుబలి సినిమాలోని మనోహరి ఎక్కువగా గుర్తింపును తీసుకొచ్చింది. ఇక ఆ తరువాత మోహన భోగరాజు మరో లెవెల్‌కి వెళ్లిపోయారు. సంగీత దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత సినిమాలోని రెడ్డమ్మ తల్లి ఆ సమయంలో అందరినీ కట్టిపడేసింది. ఆ పాటను పాడిన మోహన భోగరాజు గాత్రం అందరినీ వెంటాడింది. అలా ఆమె లైవ్‌లోకి వచ్చి పాడిన పాట, దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఆమె ఎక్కడకు వెళ్లినా, ఎక్కడ కనిపించినా కూడా రెడ్డమ్మ తల్లి పాటను పాడాల్సిందే. అది ఆనవాయితిగా మారిపోయింది. అలా ఓ సారి విట్ (వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) యూనివర్సిటీకి వెళ్లినప్పుడు అక్కడి ఆడిటోరియంలో మోహన్ భోగరాజు తన గొంతెత్తి.. ఊరికి ఉత్తరాన అని పాడటం మొదలుపెట్టేశారు. ఆ క్షణం ఆడిటోరియం మొత్తం మార్మోగిపోయింది. నాడు ఆ వీడియో నెట్టింట్లో హల్చల్ చేసింది. మళ్లీ ఇప్పుడు తిరిగి తిరిగి తమన్ వద్దకు చేరింది. అసలే బుల్లెట్టు బండి పాటతో మోహన భోగరాజు పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. ఇలాంటి సమయంలో రెడ్డమ్మ తల్లి పాట కూడా మళ్లీ పైకి వచ్చింది. ఆ వీడియోను తమన్ షేర్ చేస్తూ మోహన భోగరాజు మీద ప్రశంసలు కురిపించారు. సూపర్ టాలెంటెడ్ అంటూ మోహన గురించి చెప్పుకొచ్చారు. ఇక తమన్ తన మీద కురిపించిన ప్రేమకు మోహన స్పందించారు. ఆ పాటను పాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ఎప్పటికీ రుణ పడి ఉంటాను సర్.. ధన్యవాదాలు అని గురుభక్తిని చాటుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sUnXvB

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....