Friday, 27 August 2021

Ram Gopal Varma : RGVతో చేయకుండా ఉండలేను.. గొప్పగా ఫీలవుతున్నా : వీడియోపై నటి జ్యోతి

ఈ మధ్య డ్యాన్సులతో ఫుల్ ఫేమస్ అవుతున్నారు. తాగిన మైకంలో వర్మ చేసే విన్యాసాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. అలా వర్మ చేసిన చేష్టలు, హీరోయిన్లతో వర్మ రొమాన్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా నటి , కొత్త హీరోయిన్ ఇనయ సుల్తానాలతో వర్మ చేసిన అసభ్యకర డ్యాన్సులు చూస్తే ఎవ్వరైనా సరే తలకొట్టుకోవాల్సిందే. అయితే వాటిపై , నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మాత్రం వెరైటీగా స్పందించారు. కాళ్ల మీద పడటం, వారిని కౌగిట్లో నలపడంపై వర్మ తన స్టైల్లో సమాధానం ఇచ్చారు. మనిషి బాడీలో అన్ని పార్ట్స్‌కి సమ ప్రాధాన్యత ఉంటుందని, కానీ కాళ్ళమీద పడటం అనేది వాళ్లపై ఎంత రెస్పెక్ట్ ఉందో తెలియజేసే చర్య అని అన్నారు. తాను స్వేచ్ఛగా ఉంటానని, లీగల్‌గా ఎలాంటి తప్పు చేయను కానీ సమాజం ఏదో అనుకుంటుందని తాను అస్సలు పట్టించుకోనని చెప్పారు వర్మ. చివరగా ఆ అమ్మాయికి ఇష్టం.. నాకు ఇష్టం.. మధ్యలో మీరెవ్వరు? అని తన స్టైల్లో ఆ వీడియో, అందులో చేసిన పనులను సమర్థించుకున్నారు ఆర్జీవీ. ఆ పార్టీ అంతా కూడా తన ఇంట్లోనే జరిగిందని నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పుకొచ్చారు. తన జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది.. తన కొత్త ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానని, ఇంటికి రావొచ్చా? అని వర్మగారు అడిగారు.. ఆయనతో పాటు తన ఫ్రెండ్స్‌ను తీసుకొచ్చారు అని శ్రీకాంత్ తెలిపారు. వోడ్కా తాగి అలా చేసేశామని, ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియదని శ్రీకాంత్ అన్నారు. అయితే ఆ వీడియో, అందులోని అసభ్యకర పనులపై జ్యోతి స్పందించారు. నాకు ఇష్టమైన దర్శకుల్లో ఆర్జీవీ గారు ఒకరు.. ఆయన పాటలకు ఆయనతో కలిసి డ్యాన్స్ చేయకుండా ఉండలేను. అతని దర్శకత్వం పట్ల అతడికున్న మక్కువకు, టాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆయనతో అలా ఉండటం నాకు గౌరవంగా అనిపించింది. ఎంతో తెలివైన మనిషి. ఎంతో మంచి మనిషి. దర్శకుడిగా, ఫిల్మ్ మేకర్‌గా, ఓ మంచి మనిషిగా అన్నింటి కంటే ఆయన సెన్సాఫ్ హ్యామర్ అంటే ఎంతో ఇష్టమని జ్యోతి చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mTwuOL

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....