Tuesday, 31 August 2021

‘వరుడు కావలెను’ టీజర్.. అతను ప్రతి బాల్ సిక్స్ కొడితే.. ఆమె అన్ని బాల్స్ నోబాల్ ఇస్తుందట

తెలుగులో డిఫెరెంట్ సినిమాలు చేయడంలో హీరో ఎప్పుడూ ముందుటారు. ఆయన సినిమాలు అంటేనే అందులో ఎదో విలక్షణత ఉంటుంది. ప్రతీ సినిమాలో ఏదో డిఫరెంట్ రోల్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు నాగశౌర్య. అలా వినోదం మాత్రమే కాదు.. మంచి సందేశం ఉన్న సినిమాలు చేస్తుంటారు నాగశౌర్య. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు ‘లక్ష్య’, ‘వరుడు కావలెను’. లక్ష్య స్పోర్ట్స్ డ్రామా కాగా.. వరుడు కావలెను ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. లక్ష్యలో ఆయన మాజీ ఆర్చరీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఇక వరుడు కావలెను సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదల అయింది. ఇక ‘వరుడు కావలెను’ సినిమా నుంచి తాజాగా ప్రేక్షకులకు మరో ట్రీట్ లభించింది. ఈ సినిమా టీజర్‌ని తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ .. వరుడు కోసం ఎదురుచూస్తున్న అమ్మాయిలా.. అంతకు మంచి చాలా యాటిట్యూడ్ ఉన్న అమ్మయాలా మనకు టీజర్‌లో కనిపిస్తోంది. ఎన్ని సంబంధాలు వచ్చిన ఆమె యాటిట్యూట్ కారణంగా అవి చెడిపోవడం అనేది టీజర్‌లో మనం చూడొచ్చు. ఇక నాగశౌర్య విదేశాల నుంచి వచ్చి.. రితూ వర్మను చూసి ప్రేమలో పడతారు అని టీజర్ చూస్తే మనకి అర్థం అవుతోంది. టీజర్ ఆరంభంలో నటి నదియా, రితూ వర్మలకు మధ్య జరిగే సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక టీజర్‌లో రితూని పడేయటానికి నాగశౌర్య చేసే విన్యాసాలు ఆద్యంతం నవ్వులు పూయించాయి. ఇక నాగశౌర్య అసిస్టెంట్‌గా ప్రవీణ్, రితూ వర్మ అసిస్టెంట్‌గా వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. చివర్లో ‘ప్రతీ బాల్‌కి సిక్స్ కొట్టే బ్యాట్స్‌మెన్‌ని చూశావా’ అంటూ ప్రవీణ్ ప్రశ్నిస్తూ.. ‘ప్రతీ బాల్‌ని నోబాల్‌గా చెప్పే అంపైర్‌ని చూశావా.. అవిడ ఇస్తుంది’ అంటూ వెన్నెల కిషోర్ అంటారు. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3t2rbO0

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...