Sunday, 29 August 2021

ప్రత్యేకమైన రోజున ప్రత్యేకమైన సర్‌ప్రైజ్.. ‘పవన్’ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కి ‘భీమ్లా నాయక్’ గిఫ్ట్

రాజకీయాల కోసం పవర్‌స్టార్ మూడు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారనే విషయం మనందరికి తెలిసిందే. అయితే ఆయన రీసెంట్‌గా ‘వకీల్‌సాబ్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఓ పవర్‌ఫుల్ లాయర్‌ పాత్రలో ఈ సినిమాలో పవన్‌ కనిపించారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక.. కలెక్షన్ల పంట పండించింది. దీంతో పాటు ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వస్తున్న ‘’ ఒకటి. మలయాళంలో బ్లాక్‌బస్టార్ హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమాకు రీమేక్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హీరో ఈ సినిమాలో నటిస్తుండగా.. హీరోయిన్‌గా నిత్య మీనన్ చేస్తోంది. ఈ మధ్యే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినిమా నుంచి టీజర్‌ని వదిలారు. లుంగీ లుక్‌లో పవన్‌ ఈ టీజర్‌లో చేసిన యాక్షన్ ప్రేక్షకులను కట్టిపడేసింది. టీజర్‌ చూసిన వెంటనే సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌కు వస్తుందని అని చిత్ర యూనిట్ టీజర్ విడుదలైనప్పుడే తెలిపింది. అయితే ఆ సర్‌ప్రైజ్‌తో పాటు సినిమాలోని మొదటి పాటను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు సినిమా మేకర్స్. సినిమా నుంచి మొదటి పాటను పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా థమన్ అందించిన మ్యూజిక్‌తో ఈ పాట అదిరిపోతుంది అంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఆ పాట ఎలా ఉందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zuikGW

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....