Friday, 27 August 2021

Fahadh Faasil : Pushpa నుంచి అదిరే అప్డేట్.. భయంకరమైన పోలీస్ ఆఫీసర్‌గా ఫాహద్!

అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. రెండు పార్టులుగా తీసుకురాబోతోన్న సుకుమార్.. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసేశారు. పుష్ప ది రైజ్ అంటూ ఈ ఏడాదిలో తన సత్తాను చాటేందుకు రెడీ అయ్యారు. ఇక బన్నీకి సరైన విలన్‌ను పట్టుకొచ్చారు. ప్రస్తుతం ఇండియాలో ఫాహద్ ఫాజిల్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తన నటనతో అందరినీ కట్టిపడేస్తున్నారు. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్‌లో పేరు కనిపిస్తుంది. అలాంటి నటుడిని బన్నికి ప్రతినాయకుడిగా పట్టుకొచ్చారు సుకుమార్. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. భయంకరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫాహద్ కనిపించబోతోన్నారు. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో గుండుతో ఫాహద్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ భయంకరమైన పోలీస్ ఆఫసీర్‌కు గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్యాంగకు బీభత్సమైన పోరాట సన్నివేశాలు ఉండోబోతన్నట్టు కనిపిస్తోంది. ఇక ఫాహద్ ఫాజిల్ లుక్కు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొత్తానికి సుకుమార్ లెక్కలు మాత్రం వేరేలా ఉన్నాయని ఈ పోస్టర్లను చూస్తే తెలుస్తోంది. బన్నీ ఏమో పూర్తిగా రగ్డ్ లుక్కులో కనిపించారు. గడ్డం, ఆ జుట్టు అంతా కూడా స్మగ్లర్లలానే కనిపిస్తున్నారు. ఇక ఫాహద్ మాత్రం చూస్తేనే భయం పుట్టేలా గుండు పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. అయితే ఈ ఐపీఎస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్, మన పుష్ప రాజ్‌కు మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DmDaum

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...