Sunday, 29 August 2021

HBD Nagarjuna: బంగార్రాజు నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. నాన్నకు ప్రేమతో నాగ చైతన్య విషెస్

చాలా రోజులుగా జనం నోళ్ళలో నానుతున్న పేరు ''. అక్కినేని హీరోగా గతంలో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్‌గా ఈ సినిమా రాబోతుందని ఎప్పుడైతే న్యూస్ బయటకొచ్చిందో అప్పటినుంచే అక్కినేని అభిమానుల్లో ఎదురుచూపులు మొదలయ్యాయి. కానీ కరోనా, ఇతర కారణాలతో చాలాకాలం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చి చివరకు రీసెంట్‌గా ఈ మూవీ పట్టాలెక్కింది. దీంతో త్వరత్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ చేస్తున్న చిత్రయూనిట్.. నేడు నాగార్జున బర్త్ డే కానుకగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. నాగార్జున తనయుడు చేతుల మీదుగా ఈ పోస్టర్ విడుదల చేశారు. దీన్ని తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ వేదికగా పంచుకున్న నాగ చైతన్య.. తన తండ్రికి బెస్ట్ విషెస్ చెబుతూ ఈ సినిమాలో తాను కూడా భాగమవుతుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కాగా ‘ది డెవిల్ ఈజ్ బ్యాక్’ అనే క్యాప్షన్‌తో‌ 'బంగార్రాజు'ను రంగంలోకి దించుతుండటం ఆసక్తికరంగా మారింది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కూడా భాగం కాబోతుండటం ఓ విశేషమైతే.. ఆయన సరసన 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి రొమాన్స్ చేస్తుండటం అట్రాక్టివ్ పాయింట్. ఇందులో చైతూ రోల్ ఎంతో ప్రాధాన్యతతో కుడి ఉంటుందని తెలుస్తోంది. నాగార్జున జోడీగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోంది. బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్, యాంకర్ అనసూయలు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ మూవీపై నాగ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38jVIx2

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....