Friday, 27 August 2021

అయ్యో పాపం.. వీడియోతో కౌశల్ బుక్కయ్యాడు!.. ఆడుకుంటోన్న నెటిజన్లు

బిగ్ బాస్ రెండో సీజన్ విజేతగా నిలిచిన కౌశల్. ఇప్పుడు సినిమా హీరోగా ఫుల్ బిజీగా మారిపోయారు. వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నారు. అయితే ఎప్పుడో ఈ ప్రాజెక్ట్‌లు ఓకే కావాల్సింది. కానీ ఆలస్యమవుతూ వచ్చాయి. మొత్తానికి ఒకే సారి రెండు మూడు సినిమాలను లైన్‌లోపెట్టేశారు. అందులో అనే మూవీ ఒకటి. పీపుల్ స్టార్ అని తనది తాను ప్రకటించుకుని అభాసుపాలైన సంగతి తెలిసిందే. అలా కౌశల్ చేసే అతి ఒక్కోసారి నెట్టింట్లో కాంట్రవర్సీకి దారి తీస్తుంటుంది. తాజాగా కౌశల్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో తన రైట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తున్నట్టు ఊరించారు. హీరోయిన్ ఎవరో రివీల్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఆమెను వెనుకనుంచి మాత్రమే చూపించారు. ఆ హీరోయిన్ ఎవరై ఉంటారా? అని గెస్ చేయండి అంటూ నెటిజన్లకు పజిల్ విసిరారు కౌశల్. దీంతో నెటిజన్లు కౌశల్‌ను ఆడేసుకుంటున్నారు. కొంపదీసి తేజస్వీ కాదు కదా?.. ఓహో తమన్నా సింహాద్రి అయి ఉంటుందేమో.. ఖతర్ పాప అయి ఉంటుంది.. శివజ్యోతి అయి ఉంటుంది.. అని ఇలా రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది మాత్రం ఆమె అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కౌశల్‌ను మాత్రం నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. కౌశల్ మూవీ ప్రారంభోత్సవానికి నాగబాబు వచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఈ కథను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సమకూర్చినట్టున్నారు. ఆది సాయికుమార్ బ్లాక్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కౌశల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gHcD1f

No comments:

Post a Comment

'Please Save My Mum'

'Doctors feel they have a duty to prolong a heartbeat at all costs.' from rediff Top Interviews https://ift.tt/2TnvHrW