Tuesday, 31 August 2021

తనయుల బర్త్ డేపై బండ్ల గణేష్.. బండ్లన్న వారసులు మామూలుగా లేరు కదా!

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా చేతనైన సాయం చేస్తుంటారు. అలా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ప్రదర్శించే దూకుడుకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక బండ్లన్న ఈ మధ్య తన ఫ్యామిలీని కూడా ఫేమస్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య ఓంకార్ షోలో బండ్లన్న తన కూతురిని పరిచయం చేశారు. ఇక ఈ మధ్య తన కొడుకులను రంగంలోకి దించుతున్నారు. ఆ మధ్య తన పెద్ద కొడుకు హితేష్ అంటూ పరిచయం చేస్తూ వదిలిన ఫోటో అందరినీ ఆశ్చర్యపరచింది. జూనియర్ బండ్ల గణేష్ అంటూ హితేష్ మీద ప్రశంసలు కురిపించారు. పైగా బండ్లన్న గతంలో వేసుకున్న షర్ట్‌లోనే హితేష్ కనిపించాడు. అలా మొత్తానికి జూనియర్ బండ్ల గణేష్‌గా హితేష్‌కు మంచి క్రేజ్ వచ్చేసింది. అయితే తాజాగా బండ్లన్న తన కొడుకులిద్దరి ఫోటోలను షేర్ చేశారు. తన కుమారుల పుట్టినరోజు అంటూ బండ్లన్న ఎమోషనల్ అయ్యారు. తన తనయుల (, ) బర్త్ డే అని చెబుతూ అందరి బ్లెస్సింగ్స్ కావాలని బండ్ల గణేష్ కోరారు. ఇక బండ్లన్న ట్వీట్‌కు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు సైతం విషెస్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఇలా అందరూ కూడా బండ్లన్న వారసుల మీద ట్వీట్లు వేస్తున్నారు. వందేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉంటూ.. బండ్ల వారసత్వాన్ని నిలబెట్టాలంటూ ట్వీట్లు పెడుతున్నారు. మొత్తానికి బండ్లన్న వారసులు మాత్రం సినీ ఎంట్రీ ఇవ్వకముందే ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకునేలా ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3js07V8

No comments:

Post a Comment

'Please Save My Mum'

'Doctors feel they have a duty to prolong a heartbeat at all costs.' from rediff Top Interviews https://ift.tt/2TnvHrW