టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు అందరిలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. నాలుగేళ్లు సుప్తావస్తలో ఉన్న ఈ కేసును ఇప్పుడు (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) పరుగులు పెట్టిస్తోంది. డ్రగ్స్ కేసులో భాగంగా మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై టాలీవుడ్ సెలెబ్రిటీలను విచారించేందుకు ఈడీ సిద్దమైంది. ఈక్రమంలోనే పూరి జగన్నాథ్‌ను నేడు (ఆగస్ట్ 31) ఉదయం నుంచి రాత్రి వరకు విచారించారు. ఈడీ కార్యాలయంలో పూరి విచారణ ఉదయం 10.17నుంచి రాత్రి 7.45 గంటల వరకు విచారణ కొనసాగింది. అయితే మళ్లీ పూరి జగన్నాథ్‌ను పిలిచి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో అరెస్ట్ అయిన నిందితుల స్టేట్ మెంట్ ఆధారంగా పూరి జగన్నాధ్ ను ప్రశ్నించారు. పూరీ కి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల తో ఉన్న సంబంధాల పై ఈడీ ఆరా తీశారు.. విదేశాల నుండి డ్రగ్స్ కొనుగోళ్లు ఏ రూపంలో జరిగాయని, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వివరాలు ఈడీ అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. పూరీ జగన్నాధ్ కు సంబంధించి మూడు బ్యాంక్ ఎకౌంట్లను పరీశీలించినట్టు సమాచారం. పూరి జగన్నాధ్‌కు సంబంధించిన వైష్ణో బ్యానర్, పూరి కనెక్ట్స్ బ్యానర్ ఆడిట్ రీపోర్ట్‌లను ఈడీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పూరి జగన్నాధ్ స్టేట్ మెంట్ లిఖిత పూర్వకంగా ఎనిమిది పేజీల స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా సమాచారం. ఈడీ అధికారులు తదుపరి విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని ఆదేశం ఇచ్చారు. దీంతో తాను విచారణకు సహకరిస్తానని.. కచ్చితంగా హాజరవుతామని పూరి జగనాథ్ హామీనిచ్చినట్లు సమాచారం. ఇక ఈ తతంగంలో ఎంట్రీ కూడా అయోమయంగా మారింది. బండ్ల గణేష్ మధ్య జరిగిన లావాదేవీలపై ఈడీ విచారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు బండ్ల గణేష్‌ను పిలిపించినట్టు తెలుస్తోంది. కానీ బండ్ల గణేష్ మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నారు. తాను కేవలం పూరి జగన్నాథ్ కోసమే వచ్చానని, తనకు ఎవ్వరూ ఎలాంటి నోటీసులివ్వలేదని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Dyy7XH
No comments:
Post a Comment