Tuesday, 31 August 2021

ఆయనతో నాకు ఎలాంటి విబేధాలు లేవు.. ఆ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

ఆయన సినిమాల్లో ఒకప్పుడు తన కామెడీతో అలరించారు. ఆ తర్వాత తన స్వార్జితంతో నిర్మాతగా మారారు. స్టార్ హీరోలతో కలిసి సినిమాలు నిర్మించారు. ఎంతో సక్సెస్ కూడా సాధించారు. ఆయనే .. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అయినా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయినా.. ఆయన రూపొందించిన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాలి అంటే పవన్‌కళ్యాణ్‌తో తీసిని ‘గబ్బర్‌సింగ్’.. ఎన్టీఆర్‌తో‌ తీసిన ‘బాద్‌షా’.. ‘టెంపర్’ సినిమాలను చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్‌కి.. బండ్ల గణేష్ మధ్య విభేదాలు వచ్చాయి అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికి పడటం లేదంటూ సోషల్‌మీడియాలో ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకుంటూ పోయారు. అయితే ఈ వార్తలపై తాజాగా బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఎన్టీఆర్‌కు ఎలాంటి విబేధాలు లేవు అంటూ ఆయన స్పష్టం చేశారు. ఎదో మిస్ కమ్మూనికేషన్ వల్ల అది జరిగింది. అని అయన పేర్కొన్నారు. అన్మదమ్ముల మద్య మనస్పర్థలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి.. కానీ సంబంధం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది అంటూ అర్థం వచ్చేలా ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈ అక్టోబర్‌లో విడుదల కానుండగా.. ఆ తర్వాత కొరటాల శివతో, ప్రశాంత్ నీల్‌తో ఆయన సినిమాలు చేస్తున్నారు. ఒక బండ్ల గణేష్ కూడా హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఓ రీమేక్ సినిమాతో ఆయన హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DGSD8X

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....