Sunday, 23 May 2021

Chiranjeevi: 'ఆచార్య' నుంచి మరో సర్‌ప్రైజ్ రెడీ చేసిన కొరటాల.. మెగా కిక్కిచ్చేలా ప్లాన్

మెగాస్టార్ చిరంజీవి, కాంబోలో రాబోతున్న '' మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్ రెడీ చేశారని సమాచారం. 152వ సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మూవీ షూటింగ్ ప్రారంభం నుంచే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి- కొరటాల కాంబోలో సినిమా అనగానే మెగా అభిమానుల్లో ఆతృత నెలకొంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన యూనిట్.. మిగిలిన కొద్ది భాగం కరోనా కారణంగా వాయిదా వేశారు. దీంతో మూవీ రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేశారు. మరోవైపు ఇప్పటికే విడుదలైన 'ఆచార్య' అప్‌డేట్స్ భారీ స్పందన తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘‘లాహే లాహే’’ సాంగ్ ఓ రేంజ్‌లో అట్రాక్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ విడుదల చేసి మెగా అభిమానుల్లో జోష్ నింపాలని కొరటాల సన్నాహాలు చేస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే ఓ రొమాంటిక్‌ పాటను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఈ సాంగ్ చిరంజీవిపై చిత్రీకరించిందా? లేక రామ్ చరణ్‌తో షూట్ చేసిందా అనేది మాత్రం ఇప్పటికైతే సస్పెన్స్. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని సమాచారం. ధర్మస్థలి అనే ఊరి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా భాగమవుతున్నారు. సిద్ద పాత్రలో ఆయన నటిస్తుండగా.. చెర్రీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది. మణిశర్మ బాణీలు కడుతున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరో 15 రోజుల పాటు షూటింగ్ చేస్తే మూవీ షూటింగ్ అంతా ఫినిష్ అయినట్లే అని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34dGU0O

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....