Saturday, 22 May 2021

అల్లు వారబ్బాయిపై రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్.. ఈ నా కొడుకు అంటూ రెచ్చిపోతూ..!

సెన్సేషన్ అంటే కేరాఫ్ అడ్రస్ . ఆయన వద్ద నుంచి ఎప్పుడు, ఎలాంటి కామెంట్ వస్తుందనేది ఊహించలేం. సినిమా, రాజకీయం, అమ్మాయి గ్లామర్.. ఇలా ఏదైనా సరే తనదైన లాజిక్స్ వాడుతూ ప్రతి విషయాన్ని వైరల్ చేస్తుండటం వర్మకు వెన్నతో పెట్టిన విద్య. అయితే కొన్ని సందర్భాల్లో వర్మ వ్యవహరించే తీరు వివాదాస్పదం అవుతుండటం చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీల విషయంలో ఆయన చేసే కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తాజాగా అల్లు వారబ్బాయి అల్లు శిరీష్‌పై రామ్ గోపాల్ చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారాయి. ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటే మరోవైపు వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ తన విలక్షణత చాటుకున్నారు వర్మ. తన సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అలాగే సినీ, రాజకీయ ప్రముఖులపై వరుస కామెంట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, హీరో షేర్ చేస్తూ తనదైన కోణంలో కామెంట్ వదిలారు వర్మ. 'ఈ నా కొడుకు కెనాన్ ద బార్బేరియన్ హీరో ఆర్నాల్డ్ కొడుకు కాదు. అల్లు అరవింద్ కొడుకు. అల్లు సార్.. మీకు జోహార్' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో లేటెస్ట్ లుక్ షేర్ చేశారు వర్మ. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఏదేమైనా ట్రెండింగ్ అంశాలతో ఆన్ లైన్ సెన్సేషన్స్ క్రియేట్ చేయడంలో వర్మ ఫుల్ సక్సెస్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fG8J7k

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....