Saturday, 8 May 2021

పెళ్లిపై ఛార్మి షాకింగ్ రియాక్షన్.. మళ్ళీ అదే మాట! జీవితంలో అలాంటి తప్పు చేయనంటూ ఓపెన్..

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది . ఒకాకొన సమయంలో హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ పట్టేసి తన అందచందాలతో యువతను అట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ.. తన కెరీర్లో అనూహ్య మలుపు తీసుకొని నిర్మాత అవతారమెత్తింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభిన ఆమె దాని తాలూకు అన్ని వ్యవహారాలు భుజాలపై వేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి వార్తలు తెరపైకి రావడంతో షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది ఛార్మి. చిన్న వయసులోనే సినీ గడపతొక్కిన ఛార్మి.. గత 19 ఏళ్లుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అయితే అమ్మడికి పెళ్లి వయసు దాటిపోతుండటంతో అందరి చూపు ఆమె మ్యారేజ్‌పై పడింది. ఇంకేముంది జోరుగా వార్తలు వచ్చేశాయి. గత మూడు నాలుగు రోజులుగా ఎక్కడచూసినా వార్తలే కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు పెళ్లికి ఛార్మి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట, తన సమీప బంధువుని ఆమె పెళ్లి చేసుకోబోతోందట, అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట అనే న్యూస్ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇష్యూపై స్పందించింది ఛార్మి. పెళ్లి చేసుకోను.. చేసుకునేదే లేదు అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. తనకు ఎలాంటి తోడు అవసరం లేదని, పెళ్లిపై తనకు నమ్మకం లేదని గతంలో పలు మార్లు పేర్కొన్న ఆమె.. తాజాగా మళ్ళీ అదే రిపీట్ చేసింది. ''ప్రస్తుతం కెరీర్ హాయిగా, సాఫీగా సాగిపోతోంది. ఈ లైఫ్ నాకు చాలా సంతోషకరంగా ఉంది. నా జీవితంలో పెళ్లి చేసుకోవడం వంటి తప్పు చేయను'' అని ఛార్మి అధికారికంగా ప్రకటించడమే గాక.. ఫేక్ రైటర్స్‌పై పంచ్ విసిరింది. 'తప్పుడు స్టోరీలతో అట్రాక్ట్ చేస్తున్న మిమ్మల్ని అభినందించవచ్చు' అని ఆమె ట్వీట్ పెట్టడం గమనార్హం. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి కొన్నేళ్లుగా ప్రయాణం కొనసాగిస్తున్న ఛార్మి.. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో భారీ లాభాలు గడించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న 'లైగర్' సినిమాను పూరితో కలిసి నిర్మిస్తోంది ఛార్మి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xYV9nN

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....