Thursday, 6 May 2021

నాకంటే నా కూతురే ఫేమస్ అనేసిన హేమ.. కేబీఆర్ పార్కులో అలా! నెటిజన్ హాట్ కామెంట్‌పై షాకింగ్ రిప్లై

సినీ నటులు వారి వారి వారసులను తమ అభిమానులకు పరిచయం చేస్తూ తమ తర్వాతి తరాన్ని కూడా ఫేమస్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా హవా పెరగడంతో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ తమ అలవాట్లను, ఫ్యామిలీ విశేషాలను పంచుకుంటున్నారు. ఇప్పటికే సామజిక మాధ్యమాల్లో ఫుల్లుగా ఫాలోయింగ్ పెంచుకున్న నటి సురేఖావాణి తన కూతురు సుప్రితతో చిందులేసి ఆమెను అందరికీ పరిచయం చేసేసింది. సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకముందే సుప్రితకు కూడా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉందంటే దానికి ప్రధాన కారణం సోషల్ మీడియానే అని చెప్పుకోవాలి. తాజాగా అదే బాటలో మరో సీనియర్ నటి కూడా తన కూతురిని పరిచయం చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో హేమతో పాటు ఆమె కూతురు ఇషా కనిపిస్తోంది. ఇద్దరూ కలిసి కేబీఆర్ పార్కులో మార్కింగ్ వాక్‌కి వెళ్లి అక్కడున్న ఓ చోట చింతచెట్టుకు చింతచిగురు కోస్తూ సరదాగా ఎంజాయ్ చేశారు. ఇదే సమయంలో తాము చింతచిగురు కోస్తున్న దృశ్యాన్ని వీడియో తీస్తూనే కూతురుతో కలిసి అభిమానులతో లైవ్ చాట్ చేసింది హేమ. ఈ వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఈ లైవ్ సెషన్ లోనే హేమను ఓ నెటిజన్ హాట్ అంటూ కామెంట్ పెట్టగా దానికి ఆమె ఆసక్తికరంగా స్పందించింది. ఏమనాలో అర్ధం కాక ఇప్పుడు హాట్ ఏంట్రా నాయనా నన్ను చూస్తే పిచ్చాదానిలా ఉన్నా, ఎవరైనా చూస్తె చిల్లర వేస్తారు, అలాంటిది నీకు హాట్‌గా కనిపిస్తున్నానా అంటూ రియాక్ట్ అయింది హేమ. ప్రతి రోజు ఉదయాన్నే ఇలా మార్కింగ్ వాక్‌కి వస్తానని చెప్పిన హేమ.. ఈ రోజు రాగానే ఎందుకో చింత చెట్టు తనను టెంప్ట్ చేసిందని, రా రా కోసుకో అని ఆహ్వానించినట్లు అనిపించిందని హేమ చెప్పుకొచ్చింది. అందుకే తన కుమార్తెతో కలిసి కాస్త చింతచిగురు కోసుకున్నాను అని ఆమె చెప్పింది. 1989లో వచ్చిన 'చిన్నారి స్నేహం' అనే సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హేమ.. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటికే 200లకు పైగా సినిమాల్లో నటించింది. నేటితరం ప్రేక్షకులను కూడా అలరిస్తూ బిజీగా ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vLuPvE

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....