Sunday, 23 May 2021

అచ్చం హీరోయిన్ లాగే కరోనా దేవి విగ్రహం.. రెచ్చిపోతున్న మీమర్స్! వనిత విజయ్ కుమార్ షాకింగ్ రియాక్షన్

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. మహమ్మారి వీర విజృంభణతో జనం అల్లాడిపోతున్నారు. ఇక మరికొద్ది రోజుల్లోనే కరోనా థర్డ్ వేవ్ కూడా ముంచుకొస్తుందని వస్తున్న వార్తలు ఏ ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు కరోనాను కట్టడి చేయడానికి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకొని కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం, చూడటానికి అది అచ్చం నటి వనిత విజయ్ కుమార్‌లా ఉండటంతో సోషల్ మీడియాలో మీమ్స్ ఊపందుకున్నాయి. కరోనా అంతం కావాలంటూ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో విగ్రహం ఏర్పాటు చేశారు. అక్కడి పూజారులు ఆ విగ్రహానికి పూజలు, యజ్ఞాలు కూడా చేస్తున్నారు. దీంతో ఈ కరోనా దేవి విగ్రహం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక్కడివరకూ బాగానే ఉన్నా ఆ విగ్రహం అచ్చం వనితా విజయ్ కుమార్ మాదిరిగానే ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండటంతో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగక వనిత విజయ్ కుమార్, కరోనా దేవి విగ్రహంతో మీమ్స్ కూడా రెడీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా ఈ ఫోటోలు, మీమ్స్ రచ్చనే కనిపిస్తోంది. ఇవి చూసి ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తుండగా.. దీనిపై అటు కూడా రియాక్ట్ అయింది. ఓ మై గాడ్.. అందరూ ఈ ఫోటోతో నన్ను పోల్చుతున్నారేంటి? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రీసెంట్‌గా వనిత విజయ్ కుమార్ పెళ్లి మ్యాటర్స్ సోషల్ మీడియాలో హాట్ ఇష్యూగా మారిన సంగతి తెలిసిందే. ఇప్నడిలా మరోసారి నటి వనిత విజయ్ కుమార్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుండటం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oMk7Tw

No comments:

Post a Comment

What The Dhurandhar Girl Did Next

'The love I have received has been overwhelming.' from rediff Top Interviews https://ift.tt/1tJwmgl