Saturday, 8 May 2021

తండ్రి కోసం అలా మారిన బండ్ల గణేష్.. నటుడు, నిర్మాతే కాదు ఇందులోనూ అతను సూపరే!

బండ్ల గణేష్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అనడంతో అతిశయోక్తి లేదు. నటుడిగా కంటే.. సోషల్‌మీడియాలో పలు ఆసక్తికర కామెంట్లు చేసి.. పాపులర్ అయ్యాడు ఆయన. నటుడిగా ఎన్నో సినిమాల్లో హాస్యం పండించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాత మారి.. పవన్‌కళ్యాణ్‌, రవితేజా, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన గత ఏడాది మహేశ్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఓ ప్రత్యేక పాత్రలో సినిమాలో కనిపించాడు. ఇక తన తండ్రి కోసం కొత్త అవతారం ఎత్తాడు. ప్రస్తుతం కరోనా కారణంగా బయట భయంకర వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లాలన్ని.. ఎవరిని కలవాలన్నా.. జంకుతున్నారు ప్రజలు. వృద్ధులు పూర్తిగా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సెలూన్ షాపులకు వెళ్లాలంటే.. ప్రజలు వెనకాడుతున్నారు. ఎక్కడ వైరస్ అంటుకుంటుందన్న భయంతో తమకి తామే క్షౌరము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బండ్ల గణేశ్ కూడా తన తండ్రి కోసం బార్బర్‌గా మారాడు. ‘కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను’ అంటూ తన తండ్రికి కట్టింగ్ చేసిన వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. నటుడుగా, నిర్మాతగానే కాక.. బార్బర్‌గా కూడా బండ్ల గణేశ్ సూపర్‌ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తండ్రి విషయంలో ఆయన తీసుకుంటున్న శ్రద్ధను చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవల తమిళంలో ప్రముఖ కమెడియన్ యోగిబాబు నటించిన ‘మండేలా’ అనే సినిమాని బండ్ల గణేశ్ తెలుగులో రీమేక్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అతను ఖండించాడు. ‘అసలు ఒప్పుకుంటే కదా? తప్పుకునేది అని’ తన స్టైల్లో సెటైర్ వేశాడు బండ్ల గణేశ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uIhRyR

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....