Saturday, 8 May 2021

ఇక నువ్వే మాకు దిక్కు.. సోనూ సూద్‌ను వేడుకున్న మెహర్ రమేష్

గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచంలోకి కరోనా రాకముందు సోనూ సూద్ ఇమేజ్ వేరు. ఇప్పుడు సోనూ సూద్‌కు ఉన్న క్రేజ్ వేరు. తెరపై మాత్రమే సోనూ సూద్ విలన్. కానీ నిజ జీవితంలో ఓ సూపర్ హీరో.. ఓ రియల్ హీరో. ఎంతో మందికి మనిషి రూపంలో ఉన్న దేవుడు. గత ఏడాది కాలం నుంచి సోనూ సూద్ నిరంతరంగా సేవలు చేస్తూనే ఉన్నారు. కోట్లకు కోట్లు నీళ్లలా ఖర్చు పెట్టి ఎంతో మందికి విద్య,వైద్యం, ఉపాధి కల్పిస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడటంతో దేవుడిగా కొలుస్తున్నారు. కొన్ని చోట్ల సోనూ సూద్‌ విగ్రహాలు కట్టేసి పూజలు కూడా చేసేస్తున్నారు. ఈ సెకండ్ వేవ్ ఇంతలా విజృంభిస్తుండటంతో సోనూ సూద్ మరింత రెట్టింపు వేగంతో పని చేస్తున్నారు. ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుంటున్నారు. మొన్నామధ్య ఓ ప్రాణాన్ని కాపాడేందుకు ఏకంగా ఎయిర్ అంబులెన్స్‌ను రంగంలోకి దించారు. కానీ నిన్న రాత్రి ఆ ప్రాణం ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయింది. దీంతో సోనూ సూద్ తీవ్రంగా కలత చెందారు. దేశంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత ఉన్నా, రెమ్ డెసివర్ ఇంజక్షన్లు కావాలన్నా కూడా సోనూ సూద్ సమకూరుస్తున్నారు. అలా సోనూ సూద్, అతని ఫౌండేషన్ నిర్విరామంగా పని చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సోనూ సూద్ ఫౌండేషన్‌‌కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ వేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. టాలీవుడ్‌లో ఎన్నో పరిచయాలున్న మెహర్ రమేష్‌కు రెమ్ డెసివర్ ఇంజక్షన్లు లభ్యమవ్వడం లేదు. అలా చివరకు సోనూ సూద్‌ను వేడుకున్నారు మెహర్ రమేష్. ఆయన ఈ మేరకు వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘డియర్ సోనూ సూద్ భాయ్.. ఇది అత్యవసరం.. హైద్రాబాద్‌లో ఉన్న పొడుగు వెంకట రమణ అనే రోగికి కొన్ని ట్యాబెట్లు, రెమ్ డెసివర్ ఇంజక్షన్లు కావాలి.. నా శాయశక్తులా ప్రయత్నించాను. కానీ ఎక్కడా లభించలేదు. ఇక నువ్వే నాకు దిక్కు’ అని చేతులెత్తి దండం పెడుతున్న ఎమోజీలను మెహర్ రమేష్ షేర్ చేశారు. అయితే దీనిపై ఇంకా సోనూ సూద్ స్పందించనట్టు కనిపిస్తోంది. ఇలా సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వకుండా సోనూ సూద్ తాను చేయాల్సిన సాయం చేసేసినట్టున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Rz9wP5

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....