Sunday, 2 May 2021

హోటల్ రూమ్‌లో ప్రియుడితో పాయల్! అంతా ఓపెన్.. పెళ్లికి ముందే హీరోయిన్ డేరింగ్ స్టెప్స్!!

సెలబ్రిటీస్ అన్నాక ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ సంగతులు కామన్. ఈ మధ్యకాలంలో అయితే ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం. హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్స్, ఫేమస్ పర్సన్స్‌తో లవ్ ట్రాక్స్ ఇలా అన్నీ ఎక్కడోచోట కనిపిస్తూనే ఉన్నాయి. అయితే చాలామంది సెలబ్రిటీలు తమ తమ డేటింగ్ సంగతులను కాస్త గోప్యంగా ఉంచుతూ వస్తున్నారు. మీడియా వెంటపడి మరీ వాళ్ల ప్రేమ ముచ్చట్లను బయటకు తీస్తోంది. అయితే మాత్రం అందుకు తాను పూర్తిగా భిన్నం అంటూ ప్రియుడితో గడుపుతున్న క్షణాలను అందరి ముందుంచుతోంది. నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లో ఉంటూ తన అందాలతో ఆన్‌లైన్ వేదికలను వేడెక్కించే పాయల్.. తన వ్యక్తిగత విషయాలను సైతం ఎప్పటికప్పుడు అందరి ముందుకు తెస్తోంది. హాట్ హాట్ ఫొటోషూట్స్‌తో రచ్చ చేయడమే కాదు పర్సనల్ మ్యాటర్స్ కూడా రివీల్ చేస్తూ వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుండటం తన స్టైల్ అని చెబుతోంది. ఈ క్రమంలోనే పాయల్ ప్రేమ వ్యవహారంపై జనాల్లో జోరుగా చర్చ నడుస్తున్న వేళ ఏకంగా తన లవర్ ఇతనే అంటూ ఓపెన్ అయింది పాయల్. అప్పటినుంచి ప్రియుడు సౌరబ్ దింగ్రాతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ ఆయా ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది పాయల్ రాజ్‌పుత్. పెళ్లికి ముందే పర్సనల్ లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పకనే చెబుతోంది. అంతేకాదు తన ప్రతి సినిమా షూటింగ్ లొకేషన్‌కు లవర్‌ని వెంటపెట్టుకొని వెళుతోందట ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలోనే ఇటీవల అతడితో కలిసి బెడ్ మీద ఉన్న వీడియో వదిలి జనం నోళ్ళలో నానిన ఆమె.. తాజాగా మరో ఫొటో చూపిస్తూ షాకిచ్చింది. విజయం, అపజయం అనేది పక్కనబెడితే ఆఫర్స్ పరంగా దూసుకుపోతున్న పాయల్ రాజ్‌పుత్.. ప్రస్తుతం ఆమె ఓ పంజాబీ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ప్రియుడితో కలిసి పంజాబ్ వెళ్లిందట. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఒకే హోటల్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇది తెలిసి జనం గుసగుసలు స్టార్ట్ చేయగా.. ఇంతలో ప్రియుడితో హోటల్ రూమ్‌లో దిగిన పిక్ షేర్ చేసి తన డేరింగ్‌నెస్ బయటపెట్టేసింది పాయల్. ఈ ఫొటోలో అతనిపై వాలిపోయి మరీ ఫోజులిచ్చింది ఈ అందాల తార.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gWdvA3

No comments:

Post a Comment

'Neena Gupta And I Would Fight A Lot'

'I need to work to find some joy in this life.' from rediff Top Interviews https://ift.tt/6NQ7yYS