Saturday, 22 May 2021

ప్రధాని ఆస్కార్ లెవల్ పెర్ఫామెన్స్ అంటూ వర్మ షాకింగ్ వీడియో

ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారతదేశాన్ని చూసి వణికిపోతోంది. మనదేశంలో కరోనా విజృంభిస్తున్న తీరుకు అందరూ ఆశ్చర్యపోతోన్నారు. కరోనా ఉధృతి ఈ స్థాయిలో ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ మన దేశం మీద ఆంక్షలు విధించాయి. అంతర్జాతీయ విమానాలు రద్దు చేశాయి. అయితే దేశంలో కరోనా కట్టడికి కేంద్రం సరైన చర్యలు తీసుకోలేదని, ప్రధాని మోదీ విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ప్రధాని మోదీపై రామ్ గోపాల్ బాగానే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. చీటికి మాటికి కరోనా వైరస్, ప్రధాని మీద సెటైర్లు వేస్తూనే ఉన్నారు. సెకండ్ వేవ్, లాక్డౌన్, ప్రధాని నిస్సహాయత, ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం, కేంద్ర విధానాలు, వ్యాక్సిన్ పనితీరు ఇలా రకరకాల అంశాల మీద వర్మ తన స్టైల్లో విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నారు. అయితే తాజాగా మరో వీడియోను షేర్ చేశారు. అందులో ప్రధానిని కించపరిచేట్టు ఎడిట్ చేశారు. కరోనా మరణాలపై, ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ప్రధాని భావోద్వేగానికి లోనవుతూ మాట్లాడిన సన్నివేశాలున్నాయి. వాటిని ఆస్కార్ బెస్ట్ యాక్టర్ నామినేషన్ అవార్డులు ప్రకటించే వేడుకకు మిక్స్ చేశారు. అలా ప్రధాని నరేంద్ర మోదీకి బెస్ట్ యాక్టర్ ఆస్కార్ అవార్డుకు అర్హులు అన్నట్టుగా వర్మ సెటైర్ వేశారు. ఇలా ఆర్జీవీ గత కొన్ని రోజులుగా దేశ ప్రధానిని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏకంగా వీడియోను షేర్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2T6vh9H

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....